సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై జీవితకాలం ప్రతి నెలా రూ. 5 వేలు

సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై జీవితకాలం ప్రతి నెలా రూ. 5 వేలు

వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇన్వేస్ట్‌మెంట్‌ రూపంలో అటల్ పెన్షన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని వివరాలు తెలుసుకుందాం.

వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇన్వేస్ట్‌మెంట్‌ రూపంలో అటల్ పెన్షన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని వివరాలు తెలుసుకుందాం.

దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పేద ప్రజల దగ్గర నుంచి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల వరకు ఎన్నో స్కీమ్ లను ప్రారంభిస్తున్నారు. ఇలా ఇప్పటికే రైతుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు లైఫ్‌ లాంగ్‌ సెక్యూర్‌ గా ఉండే అనేక పథకాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే జాబ్‌ ప్రొఫెషన్‌లో ఉన్న వ్యక్తులు వృద్ధాప్యంలో ఆర్థికంగా  హాయిగా జీవితం గడిపేందకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన స్కీమ్‌ అందుబాటులోకి తీసుకువచ్చిది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. 
సాధారణంగా ప్రతి ప్రొఫెషన్‌కు జాబ్‌ రిటైర్‌మెంట్‌  ఉంటుంది. ఇక ఆ సమయంలో సంపాదించిన కొంత మొత్తాన్ని ఆరోగ్యం, ఇతర ఖర్చులకు ఇబ్బందులు లేకుండా దాచుకోవాలని చాలామంది భావిస్తుంటారు. అందుకోసం ప్రభుత్వ ఆధ్వార్యంలో ఉండే ఏదైనా స్కీమ్స్‌ లో ఇన్వేస్ట్‌ చేయాలని చూస్తుంటారు. ఈ ​‍క్రమంలోనే భారతదేశంలో ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక రకాల స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే అసంఘటిత రంగంలోని ప్రజలకు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు, కార్మికులకు ఈ పెట్టుబడి పథకాల గురించి పెద్దగా అవగాహన లేదు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రూపొందించింది. అసంఘటిత రంగానికి సంబంధించిన ఉద్యోగులు లేదా కార్మికులకు ఈ స్కీమ్‌ ఓ వరమని చెప్పొచ్చు.
ఎందుకంటే.. ఈ స్కీమ్‌ లో  అతి తక్కువ మొత్తం రూ.210 పెట్టుబడి పెట్టడం ద్వారా, ప్రతి నెలా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. అంటే జీవితాంతం ప్రతి సంవత్సరం రూ.60,000 పెన్షన్ వస్తుంది. కాగా, అందుకు ప్రతి నెలా కేవలం రూ.210 డిపాజిట్ చేస్తే చాలు..మీ పదవి విరమణ తర్వాత అనగా.. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల గరిష్టంగా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. ఇక ఈ అటల్‌ పెన్షన్‌ యోజన నిబంధనల ప్రకారం, మీరు 18 ఏళ్ల వయస్సులో నెలకు గరిష్టంగా రూ.5,000 పెన్షన్‌ పొందాలని నిర్ణయించుకుంటే, ప్రతి నెలా రూ.210 చెల్లించాలి. ఇలా మూడు నెలలకు ఓ సారి చెల్లించాలి అనుకుంటే రూ.626, ఆరు నెలలకు ఎంచుకుంటే రూ.1,239 చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు రిటైర్‌మెంట్‌ తర్వాత నెలకు రూ.1,000 పెన్షన్ సరిపోతుందనుకుంటే.. 18 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి ప్రారంభిస్తే, నెలకు రూ.42 చెల్లిస్తే సరిపోతుంది. 
ఇక వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో అటల్ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాగా, ఈ  స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది. అంతేకాకుండా.. అటల్ పెన్షన్ యోజన కింద ఓ వ్యక్తి ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. భారత ప్రభుత్వం కనీస పెన్షన్ ప్రయోజనానికి హామీ ఇస్తుంది. ఈ పథకం కింద రూ.1,000, రూ.2000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనే దానిపై మీరు అందుకునే పెన్షన్‌ ఆధారపడి ఉంటుంది. చిన్న వయస్సులో ఇన్వెస్ట్‌ చేస్తే పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన అమౌంట్‌ పెరుగుతూ పోతుంది.
అయితే 18- 40 సంవత్సరాల భారత పౌరులు ఎవరైనా అటల్‌ పెన్షన్‌ యోజనలో చేరవచ్చు. కనీసం 20 సంవత్సరాల పాటు తప్పనిసరిగా కాంట్రిబ్యూట్‌ చేయాలి. 60 సంవత్సరాల నుంచి పెన్షన్‌ అందుతుంది. ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్‌ అకౌంట్‌, వ్యాలీడ్‌ మొబైల్ నంబర్ కూడా అవసరం. పన్ను చెల్లింపుదారులు అయి ఉండకూడదు. మరి, కేంద్ర ప్రభుత్వం ఇన్వేస్ట్‌ రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ అటల్ పెన్షన్ పథకం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.
Show comments