Telangana : తెలంగాణ RTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై లగ్జరీ ప్రయాణం!

Telangana : తెలంగాణ RTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై లగ్జరీ ప్రయాణం!

హైదరాబాద్‌ నగరంలో ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన నుంచి మహిళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే నగరంలో అదనంగా కొన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితులు ఇంక అలానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నగర ప్రయాణికులకు ఆర్టీస్‌ మరో గుడ్‌న్యూస్‌ ను చెప్పింది.

హైదరాబాద్‌ నగరంలో ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన నుంచి మహిళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే నగరంలో అదనంగా కొన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితులు ఇంక అలానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నగర ప్రయాణికులకు ఆర్టీస్‌ మరో గుడ్‌న్యూస్‌ ను చెప్పింది.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికరంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగతుంది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు మరింత ఎక్కువగా పెరిగిందనే చెప్పవచ్చు. దీంతో బస్సులో  విపరీతమైన రద్దీగా ఉండటంతో పాటు.. ఖాళీ ఉండటం లేదు. ఇ‍క సిటీ బస్సుల్లో పరిస్థితి అయితే అంతకన్నా  దారుణంగా ఉంది. ముఖ్యంగా టికెట్ కొనుక్కొని ప్రయాణించేవారికి కూడా సీటు దొరకటం లేదు. ఇక ఈ పరిస్థితిలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌లో కొత్త బస్సులు నడుపుతున్న విషయం తెలిసిదే. అయితే తాజాగా నగర వాసులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు మరో గుడ్‌ న్యూస్‌ ను తెలిపింది ఆ వివరాళ్లోకి వెళ్తే..

మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఫ్రీ బస్సులను ఉపయోగించుకుంటున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. టికెట్ కొనుక్కొని ప్రయాణించేవారికి సీటు కూడా దొరకటం లేదు.  ఈ నేపథ‍్యంలోనే.. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆర్టీసీ కొత్త బస్సులు నడుపుతోంది. వాటిలో  25 ఎలక్ట్రిక్ ఏసీ, 25 నాన్ ఎసీ ఎలక్ట్రిక్ బస్సులు నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కాగా, ఇప్పుడు వీటితో పాటు మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు జులై చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఇక ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఆర్టీసీ అధికారులు త్వరలోనే ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా మరో 125 డీలక్స్ బస్సులను నడపాలని నిర్ణయించుకుంది.

ఇక ఈ బస్సులు కూడా జులైలోనే ప్రయాణికులకు అందుబాటులో రానున్నాయి. అయితే ఈ డీలక్స్‌ బస్సులు హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన రూట్లలో నడపనున్నారు. కాగా,  ప్రస్తుతం సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. అయితే సౌకర్యవంతంగా వెళ్లాలనుకునే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని కొత్త డీలక్స్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారందరూ టిక్కెట్‌ తీసుకోవాల్సిందేనని ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.

Show comments