Good News For Students 4 Days Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ పాఠశాలలకు 4 రోజులు సెలవులు!

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ పాఠశాలలకు 4 రోజులు సెలవులు!

Good News For Students 4 Days Holidays For Those Schools: విద్యార్థులకు ఇది భారీ శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఆ పాఠశాలలు విద్యార్థులకు ఏకంగా నాలుగు రోజులు సెలవులు ఇచ్చేశాయి.

Good News For Students 4 Days Holidays For Those Schools: విద్యార్థులకు ఇది భారీ శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఆ పాఠశాలలు విద్యార్థులకు ఏకంగా నాలుగు రోజులు సెలవులు ఇచ్చేశాయి.

పిల్లలకు పాఠశాలలకు సెలవులు అంటే మాత్రం అలర్ట్ అయిపోతారు. ముందుగానే ఏ నెలలో ఏ పండగ ఉంది? ఎన్నిరోజులు సెలవులు వస్తాయి అని లెక్కలు వేసుకుంటారు. అలాంటి స్టూడెంట్స్ కి ఇది భారీ శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా 4 రోజులు సెలవులు అంటే మాటలు కాదు కదా? అదే గుడ్ న్యూస్ ఇప్పుడు పాఠశాల విద్యార్థులకు అందుతోంది. అయితే ఈ గుడ్ న్యూస్ అందరికీ కాదు.. కేవలం కొందరికి మాత్రమే. ప్రభుత్వం బక్రీద్ సందర్భంగా జూన్ 17న సెలవుదినంగా ప్రకటించింది. అంటే సోమవారం రోజు విద్యార్థులకు సెలవు ఉంటుంది. కానీ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రం నాలుగు రోజులు సెలవు ప్రకటించాయి.

బక్రీద్ పండుగ అంటే ముస్లింలకు ఎంతో ప్రత్యేకంమైన దినం. ఈ రోజున ప్రార్థనలు చేసుకోవడమే కాకుండా.. చుట్టు పక్కల వారికి, పొరుగు వారికి మాంసాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రభుత్వాలు కూడా సెలవు దినాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం బక్రీద్ సందర్భంగా జూన్ 17న సెలవు ప్రకటించింది. అంటే సోమవారం రోజున సెలవు ఇచ్చారు. కాబట్టి ఆదివారం, సోమవారం రెండ్రోజులు సెలవులు వచ్చాయి. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం జూన్ 18ని కూడా సెలవుగా ప్రకటించాయి. వారికి మొత్తం జూన్ 15 నుంచి జూన్ 18 వరకు సెలవులు ఇచ్చారు. అంటే ఆ పాఠశాలలు తిరిగి జూన్ 19న ప్రారభం అవుతాయి.

బక్రీద్ సందర్భంగా విద్యార్థులకు కొందరికి రెండ్రోజులు, కొందరికి మూడ్రోజులు సెలవులు వచ్చేశాయి. అయితే సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కి కూడా ఇది లాంగ్ వీకెండ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. అలాగే బక్రీద్ సందర్భంగా సోమవారం ఆప్షనల్ హాలిడే. అంటే సోమవారం ఆఫీస్ వాళ్లు సెలవు ఇస్తే సాఫ్ట్ వేర్ వారికి కూడా మూడ్రోజులు సెలవులు వచ్చేసినట్లే. ఇలా ఈ వీకెండ్ మాత్రం అందరికీ సెలవులు పుష్కలంగా వచ్చేశాయి. అందుకే అంతా ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు. ఇంక బక్రీదు జరుపుకునే వాళ్లు భాగ్యనగరం నుంచి సొంతూళ్లకు ప్రయాణం అయిపోతున్నారు. మరి.. మీకు ఎన్ని రోజులు సెలవులు వచ్చాయి? కామెంట్ చేయిండి.

Show comments