పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధర ఎంతంటే!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధర ఎంతంటే!

పసిడి ప్రియులకు శుభవార్త.. ఈ మధ్య కాలంలో కోడెక్కుతున్న బంగారం ధరలు.. ఈరోజున ఒక్కసారిగా పడిపోయాయి. తులం బంగారం ధర దాదాపు రూ.500 వరకు పడిపోయింది అని సమాచారం. మరి ఏప్రిల్ 6న బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

పసిడి ప్రియులకు శుభవార్త.. ఈ మధ్య కాలంలో కోడెక్కుతున్న బంగారం ధరలు.. ఈరోజున ఒక్కసారిగా పడిపోయాయి. తులం బంగారం ధర దాదాపు రూ.500 వరకు పడిపోయింది అని సమాచారం. మరి ఏప్రిల్ 6న బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

బంగారం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. కాస్త కూస్తో బంగారం కొని ఉంచితే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో బంగారం రేట్లు ఎప్పుడు తగ్గుతాయా ఎప్పుడు కొందామా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ, గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. దీనితో బంగారం కొనాలని అనుకునే వారికి నిరాశలే మిగులుతున్నాయి. ఈ క్రమంలో పసిడి ప్రియులకు శుభవార్త అందించేలా.. ఏప్రిల్ 6న బంగారం ధరలు అమాంతంగా పడిపోయాయి. దీనితో ప్రజలకు కాస్త ఊరట కలిగిందని చెప్ప వచ్చు. పైగా బంగారంతో పాటు వెండి రేట్లు కూడా ఈరోజు తగ్గుముఖం పట్టాయి. తులం బంగారం ధర దాదాపు రూ.500 వరకు పడిపోయింది అని సమాచారం. అలాగే.. కిలోపై రూ.300 మేర తగ్గిందట. ఈ క్రమంలో ఏప్రిల్ 6న బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మర్కెట్స్ లో బంగారం ధరలు రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. అంతకముందు రోజు కంటే కూడా ఈరోజు దాదాపు 100 డాలర్ల వరకు పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2330 వద్దకు చేరుకుంది. అలానే, స్పాట్ సిల్వర్ రేటు 27.50 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. మరో పక్క ఇండియన్ కరెన్సీ విలువ ప్రస్తుతం రూ.83.298 వద్ద కొనసాగుతోంది. ఇక భాగ్యనగరం విషయానికొస్తే.. భాగ్యనగరంలో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ.490 వరకు పడిపోయింది.దీనితో తులం బంగారం ధర రూ.70 వేల 130 వద్దకు వచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.450 వరకు పడిపోయి రూ. 64 వేల 300 వద్దకు వచ్చింది. దీనితో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు బంగారంతో పాటు వెండి ధర కూడా.. ఈరోజు తగ్గుముఖం పట్టడడంతో.. ప్రజలకు ఇది నిజంగా ఒక మంచి వార్త అని చెప్పి తీరాలి. ఏప్రిల్ 6న హైదరాబాద్ లో కిలో వెండి రేటు రూ.300 వరకు తగ్గింది. దీనితో కిలో వెండి ధర రూ. 81 వేల 700 వద్దకు వచ్చింది. ఇక ఢిల్లీలో చూసినట్లైతే.. కిలో వెండి రూ.300 తగ్గి రూ.81,700 వద్దకు చేరింది. అయితే, ఇప్పటివరకు చెప్పుకున్న ధరలన్నీ కూడా జీఎస్‌టీ వంటి పన్నులు లేకుండా పేర్కొన్నవి. ఒకవేళ పన్నులు కలిపితే కనుక ధరల్లో ఎంతో కొంత మార్పు ఉంటుంది. అలాగే ఆయా ప్రాంతాలను బట్టీ కూడా ధరల్లో మార్పులు ఉంటాయి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments