ప్రేమ పేరుతో మోసం! భర్తని కూడా వదిలేసి వస్తే.. నట్టేట ముంచేశాడు!

ప్రేమ పేరుతో మోసం! భర్తని కూడా వదిలేసి వస్తే.. నట్టేట ముంచేశాడు!

ప్రేమ, పెళ్లి అనే పదాలు లవర్స్ మధ్య నీటి మీద రాసిన రాతల్లాగా మారిపోయాయి. శారీరక అవసరాల కోసం ప్రియురాల్ని లోబర్చుకుంటున్నాడు ప్రియుడు. ఆమెకు మాయమాటలు చెప్పి.. చివరకు

ప్రేమ, పెళ్లి అనే పదాలు లవర్స్ మధ్య నీటి మీద రాసిన రాతల్లాగా మారిపోయాయి. శారీరక అవసరాల కోసం ప్రియురాల్ని లోబర్చుకుంటున్నాడు ప్రియుడు. ఆమెకు మాయమాటలు చెప్పి.. చివరకు

ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎలా ఏర్పడుతున్నాయో చెప్పడం కష్టం. అలాగే కొన్ని రిలేషన్స్ చూస్తే మాత్రం సమాజం ఎటుపోతుందో అన్న సందేహం కలుగకమానదు. నిండా 25 సంవత్సరాలు లేని అమ్మాయిలు.. 40-50 ఏళ్ల అంకుల్స్‌తో వివాహేతర సంబంధాలను నెరుపుతున్నారు. అలాగే అబ్బాయిలు కూడా ఆంటీలపై కన్నేసి.. ప్రేమ పేరుతో వంచించి.. తమ శారీరక వాంఛను తీర్చుకుంటున్నారు. పెళ్లైన స్త్రీ లేదా.. భర్త నుండి విడిపోయిన మహిళకు వల వేసి తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. అనంతరం ఆమెను మోసం చేసి పరారౌతున్నాడు. ఇప్పుడు ఓ పాతికేళ్ల యువకుడు.. 34 ఏళ్ల మహిళతో ప్రేమ వ్యవహారం సాగించి.. ఇప్పడు ఏం చేశాడంటే..?

భర్తకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్న మహిళకు దగ్గరైన ఓ కుర్రాడు.. ఆమెను లోబర్చుకుని.. గర్భవతిని చేశాడు. అనంతరం ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని చెబుతుంటే తప్పించుకుని తిరుగుతుండటంతో.. ఆ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భర్తతో పెళ్లై.. గొడవలు జరుగుతుండటంతో అతడికి  విడాకులిచ్చిందో 34 ఏళ్ల పంతులమ్మ. ఒంటరిగా జీవిస్తున్న ఆమె లైఫ్ లోకి వచ్చాడు  కొలెగాల తేరంబలి గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు. హరీష్ మైసూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరికి సింగింగ్ అంటే ఇష్టం. ఓ ఈవెంట్ సందర్భంగా పాడేందుకు వెళ్లగా.. అక్కడ వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం.. స్నేహానికి దారి తీసింది.

కాగా, ఈ చనువుతో డిసెంబర్ 31న పార్టీకి పిలిచి.. ఆమెతో మద్యం తాగించి.. ఆపై అత్యాచారం చేశాడు హరీష్. అతడు చేసిన పనికి షాక్ తిన్న ఆమె.. ప్రశ్నించగా.. నువ్వంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. అతడి ఒత్తిడికి తలొగ్గింది. ఇక ఇద్దరు తరచుగా శారీరకంగా కలుస్తూ ఉండేవారు. ఇంతలో ఆమె గర్భవతి అయ్యింది. అయితే ప్రియురాలికి బలవంతంగా అబార్షన్ చేయించాడు. చివరకు పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది టీచర్. మా ఇంట్లో మన పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని కబుర్లు చెప్పాడు. దీంతో ఆమె సరస్వతీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అతను నాపై అత్యాచారం చేశాడని, గత రెండు నెలలుగా కనిపించడం లేదని పేర్కొంది. తనను అతడు పెళ్లి చేసుకుంటే కేసును వెనక్కి తీసుకుంటానని చెప్పింది. తనకు న్యాయం చేయండని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భర్తను వద్దనుకుంటే.. ఆమెను ప్రియుడు ముంచేశాడు.

Show comments