కళ్ల ముందు బంగారపు హుండీ! BCCI అతన్ని కోచ్‌గా తెస్తే మనకి వరల్డ్ కప్స్ పక్కా!

కళ్ల ముందు బంగారపు హుండీ! BCCI అతన్ని కోచ్‌గా తెస్తే మనకి వరల్డ్ కప్స్ పక్కా!

Gautam Gambhir, Head Coach, Team India: ద్రవిడ్‌ తర్వాత టీమిండియాకు ఎవరు హెడ్‌ కోచ్‌ ఉంటే బాగుంటుందనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దానికి సమాధానంగా.. ఇతను అయితే బెస్ట్‌ అనే వాదన వినిపిస్తోంది. మరి అతను ఎవరు? ఎందుకు బెస్ట్‌? లాంటి విషయంలో వివరంగా తెలుసుకుందాం..

Gautam Gambhir, Head Coach, Team India: ద్రవిడ్‌ తర్వాత టీమిండియాకు ఎవరు హెడ్‌ కోచ్‌ ఉంటే బాగుంటుందనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దానికి సమాధానంగా.. ఇతను అయితే బెస్ట్‌ అనే వాదన వినిపిస్తోంది. మరి అతను ఎవరు? ఎందుకు బెస్ట్‌? లాంటి విషయంలో వివరంగా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత.. జూన్‌ 2 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభం కానుంది. ఆ మెగా టోర్నీ తర్వాత.. టీమిండియాకు కొత్త హెడ్‌ రానున్నాడు. ప్రస్తుతం హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగియనుండటంతో కొత్త కోచ్‌ కోసం వెతుకులాట మొదలుపెట్టింది భారత క్రికెట్‌ బోర్డు. ఇప్పటికే కోచ్‌ పదవి కోసం దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. అయితే.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఎవరొస్తే బాగుంటుంది? ద్రవిడ్‌ వారసుడు ఎవరు? టీమిండియాతో వరల్డ్‌ కప్పులు కొట్టించే కోచ​ ఎవరు? అని క్రికెట్‌ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికు పలువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

టీమిండియా మాజీ క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, యువరాజ్‌ సింగ్‌ పేర్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అలాగే విదేశీ ఆటగాళ్లలో న్యూజిలాండ్‌కు చెందిన స్టీఫెన్ ఫ్లెమింగ్, శ్రీలంకకు చెందిన మహేల జయవర్దనే పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే.. వీరంద్దరిలో టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అయితే బెటర్‌ అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కళ్ల ముందు బంగారపు హుండీ పెట్టుకుని.. బీసీసీఐ అనవసరంగా ఊరంతా వెతుకుతుందని క్రికెట్‌ నిపుణులు కూడా అంటున్నారు. వారు అంటున్నట్లు గంభీర్‌ ఎందుకు టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఎలా బెస్ట్‌ ఆప్షన్‌ అవుతాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా మాజీ క్రికెటర్‌గా గంభీర్‌కు ఇండియన్‌ క్రికెటర్‌పై పూర్తి అవగాహన ఉంది. అలాగే ప్రస్తుతం టీమ్‌లో ఉన్న స్టార్‌ ప్లేయర్లతో గంభీర్‌ చాలా కాలం కలిసి ఆడాడు. వాళ్ల బలం ఏంటో, వాళ్లు ఏం చేయగలరో గంభీర్‌కు బాగా తెలుసు. అలాగే యువ క్రికెటర్లను ట్రైన్‌ చేయగల సత్తా గంభీర్‌కు ఉంది. టీమిండియా తరఫున ఆడుతూ.. టీ20 వరల్డ్‌ కప్‌ 2007 గెలిచాడు, ఫైనల్లో టాప్‌ స్కోరర్‌ కూడా. అలాగే 2011 వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచాడు. అప్పుడు కూడా ఫైనల్‌ల్లో గంభీరే టాప్‌ స్కోరర్‌. ఆసియా కప్‌ 2008లో ఫైనల్‌ ఆడాడు. ఆసియా కప్‌ 2010లో గెలిచాడు. ఇక ఐపీఎల్‌లో 2008, 2009లో సెమీ ఫైనల్స్‌ ఆడాడు. 2011, 2016, 2017లో ప్లే ఆఫ్స్‌ ఆడాడు. ఇక తన కెప్టెన్సీలో కేకేఆర్‌ను తిరుగులేని శక్తిగా మార్చి.. 2012, 2014లో ఛాంపియన్‌గా నిలిపాడు.

క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన తర్వాత.. మెంటర్‌గా మారి 2022, 2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటర్‌గా వ్యవహరించాడు. ఆ రెండు సీజన్స్‌లోనూ లక్నో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ ఏడాది గంభీర్‌ మెంటర్‌షిప్‌లో ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇలా ఆటగాడిగా, కెప్టెన్‌, మెంటర్‌గా గంభీర్‌ ఎంతో సాధించాడు. వీటన్నింటికి మించి.. క్రికెట్‌పై అతనికున్న ప్రేమ, తపన.. గెలవాలన్న కసి.. గెలిచేందుకు అతను రచించే వ్యూహాలు, ఆటగాళ్లను సరిగ్గా వాడే నైపుణ్యం గంభీర్‌ సొంతం. అందుకే టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ వస్తే.. టీమిండియా కచ్చితంగా వరల్డ్‌ కప్స్‌ నెగ్గుతుందని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments