Ram Charan- Anant Ambani Pre Wedding: టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కు మాత్రమే ఎందుకు ఆహ్వానం?

టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కు మాత్రమే ఎందుకు ఆహ్వానం?

Ram Charan- Aanant Ambani Pre Wedding: అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రామ్ చరణ్ జంట మెరిసిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం ఎందుకు దక్కింది.

Ram Charan- Aanant Ambani Pre Wedding: అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రామ్ చరణ్ జంట మెరిసిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం ఎందుకు దక్కింది.

గత కొన్నిరోజులుగా అంబానీ ఫ్యామిలీ మొత్తం వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. అందుకు కారణం అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ వివాహమే. వీల్లిద్దరు జులై 12న పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. కానీ, అంతకంటే ముందే ప్రీ వెడ్డింగ్ వేడుకలతో అదరగొట్టేశారు. మార్చి 1 నుంచి మొత్తం మూడ్రోజులు జామ్ నగర్ లో వీళ్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకంటే ముందే 51 వేల మంది స్థానికులకు అన్న సేవ కూడా చేశారు. ఇలా ఈ పెళ్లికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే అతిథుల విషయంలో కూడా అది స్పష్టంగా కనిపించింది. ఈ ప్రీ వెడ్డింగ్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో అతిథులుగా హాజరయ్యారు. కానీ, టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్ కు మాత్రమే ఎందుకు అహ్వానం అందింది?

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న టాపిక్.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, స్టార్లు ఈ వేడుకకు హాజరయ్యారు. ఆడుతూ, పాడుతూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. క్రికెటర్లు, బిజినెస్ టైకూన్స్, వరల్డ్ ఫేమస్ సింగర్స్, బాలీవుడ్ స్టార్స్, సోషల్ యాక్టివిస్ట్స్ ఇలా ఎంతో మందికి ఆహ్వానం అందింది. అయితే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కు మాత్రమే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానం దక్కినట్లు తెలుస్తోంది. చెర్రీ దంపతులు మాత్రమే టాలీవుడ్ నుంచి ఆ వేడుకల్లో మెరిశారు.

అందరూ ఇప్పుడు ఎందుకు కేవలం రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం దక్కింది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ అది రామ్ చరణ్ ఒక్కడికి మాత్రమే దక్కిన ఆహ్వానం కాదు.. మొత్తం టాలీవుడ్ కు దక్కిన గౌరవం అది. టాలీవుడ్ కి ప్రాధాన్యం ఇస్తూ రామ్ చరణ్ కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అంబానీ ఫ్యామిలీ అన్ని రంగాల నుంచి టాప్ సెలబ్రిటీలకు ఆహ్వానాలు పంపాయి. అక్కడున్న తారలను పరిశీలించినా కూడా ఆ విషయం స్పష్టమవుతుంది. అలాగే టాలీవుడ్ ని గౌరవిస్తూ ముఖేశ్ అంబానీ రామ్ చరణ్ కు ఆహ్వానం పంపారు. ఇది కేవలం రామ్ చరణ్ జంటకు దక్కిన గౌరవం మాత్రమే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి దక్కిన గుర్తింపు, గౌరవంగా భావించాలి.

ఇంక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల విషయానికి వస్తే.. మొత్తం మూడ్రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించారు. మొత్తం ఈ వేడుకల కోసం రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మూడ్రోజుల్లో ఏకంగా 2500 రకాల వంటకాలు అతిథులకు వడ్డించినట్లు తెలుస్తోంది. జామ్ నగర్లో 5 స్టార్ హోటల్స్ లేనందున.. వచ్చిన సెలబ్రిటీల కోసం 5 స్టార్ హోటల్ కి మించిన సౌకర్యాలతో లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ గురించి చర్చ జరుగుతోంది. అంతటి అపరకుబేరులు అయ్యి ఉండి కూడా.. ప్రధాని మోదీ పిలుపుతో డెస్టినేషన్ వెడ్డింగ్ అని విదేశాలకు పరుగులు పెట్టకుండా.. తమ సొంతూరిలో ఇలా ప్రీ వెడ్డింగ్ నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి.. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కు ఆహ్వానం దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments