ప్రజల దృష్టిలో హీరోలుగా మారిన హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు! గ్రేట్ వర్క్!

ప్రజల దృష్టిలో హీరోలుగా మారిన హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు! గ్రేట్ వర్క్!

ప్రజలకు కల్తీ ఫుడ్ అందిస్తూ దారుణాలకు ఒడిగడుతున్న హోటల్స్, రెస్టారెంట్లై హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరఢా ఝళిపిస్తున్నారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు హీరోలుగా మారారు.

ప్రజలకు కల్తీ ఫుడ్ అందిస్తూ దారుణాలకు ఒడిగడుతున్న హోటల్స్, రెస్టారెంట్లై హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరఢా ఝళిపిస్తున్నారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు హీరోలుగా మారారు.

ప్రస్తుత బిజీ లైఫ్ లో ఇంట్లో వంట చేసుకుని తినే వారి సంఖ్య తగ్గుతోంది. ఎంత ఖర్చైన పర్వాలేదని హోటల్స్ నుంచి తెప్పించుకుని ఆకలిని తీర్చుకుంటున్నారు. ఆన్ లైన్ ఫుడ్ యాప్ లను వినియోగించుకుని హోటల్స్ నుంచి తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను ఆర్డర్ పెట్టుకుంటున్నారు. పండగలకు, వీకెండ్స్, ఇతర అకేషన్స్ ఉన్నప్పుడు చాలా మంది కుటుంబంతో కలిసి రెస్టారెంట్, హోటల్స్ కు వెళ్తుంటారు. వందలు, వేలు ఖర్చు చేసి ఫుడ్ కొనుగోలు చేస్తుంటారు. అయితే హోటల్స్ లోని ఆ ఆహార పదార్థాలు నాణ్యత లోపించి ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ పై దాడులు నిర్వహించారు. ఈ రైడ్స్ లో విస్తు పోయే నిజాలు వెలుగు చూశాయి.

పేరుకే పెద్ద పెద్ద హోటల్స్. కానీ అందులో లభించే ఫుడ్ మాత్రం శుచి శుభ్రత లేకుండా పోతుంది. హోటల్, రెస్టారెంట్ల యాజమాన్యాలు కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఫుడ్ అందిస్తూ కస్టమర్ల ప్రాణాలకే ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో హోటల్స్ ఫుడ్ దారుణంగా తయారయ్యింది. హోటల్స్ లో కల్తీ మాంసం, మసాలాలు, నాణ్యత లేని ఆహార పదార్ధాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అపరిశుభ్రమైన కిచెన్స్, ఆహార పదార్థాలపై తిరుగాడుతున్న బొద్దింకలు కనిపించడంతో హోటల్ యాజమాన్యాల నిర్లక్ష్యం ఎంతుందో ఇట్టే తెలిసిపోతుంది. కేవలం ధనార్జనే లక్ష్యంగా పెట్టుకుని కల్తీ ఫుడ్ సప్లై చేస్తూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లక్డీకాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ప్రముఖ హోటల్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుండా ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదు. ఈ తనీఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే దృష్యాలు ఫుడ్ ప్రియులను కలవరపెడుతున్నాయి.

పేరున్న హోటల్స్ కు వెళితే ఆహారం బాగుంటుందని, ఆరోగ్యాలకు ఏ ఢోకా ఉండదని వెళ్తుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు బిగ్ షాక్ తగులుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలతో హోటల్స్, రెస్టారెంట్ల భాగోతం బయటపడుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్ధాలు, కాలం చెల్లిన ప్రాడక్ట్స్ ను వాడుతూ ఫుడ్ తయారు చేస్తున్న హోటల్స్ పై ఉక్కుపాదం మోపుతూ ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటుండడంతో జనాల దృష్టిలో హీరోలుగా మారారు. ఫుడ్ సేఫ్టీ అధికారులపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments