iDreamPost

పెట్స్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. Swiggy కొత్త సేవలు షురూ..

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త సేవలను ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్ తో వారికి ప్రయోజనం చేకూరనున్నది. ఇంతకీ స్విగ్గీ ప్రారంభించిన ఆ సర్వీస్ ఏంటంటే?

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త సేవలను ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్ తో వారికి ప్రయోజనం చేకూరనున్నది. ఇంతకీ స్విగ్గీ ప్రారంభించిన ఆ సర్వీస్ ఏంటంటే?

పెట్స్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. Swiggy కొత్త సేవలు షురూ..

ఆన్ లైన్ ఫుడ్ యాప్స్ ఫుడ్ ప్రియులకు మంచి వేదిక అయ్యింది. తమకు కావాల్సినప్పుడల్లా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఉన్న చోటుకే డెలివరీ చేస్తున్నాయి ఫుడ్ డెలివరీ సంస్థలు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో వంట చేసుకునే తీరిక ఎవరికీ ఉండడం లేదు. దీంతో ఆన్ లైన్ ఫుడ్ యాప్ లకు ఫుడ్ డిమాండ్ పెరిగింది. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీలో వాటి హవా కొనసాగిస్తున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కస్టమర్లకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది. అయితే ఇప్పటి వరకు ఫుడ్ ఆర్డర్లు, నిత్యావసర సరుకులు డెలివరీ చేస్తున్న స్విగ్గీ తాజాగా కొత్త సేవల్ని ప్రారంభించింది. ఈ సేవలతో వారికి ఎంతో ప్రయోజనం కలుగనున్నది.

స్విగ్గీ తన సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే సక్సెస్ అయ్యింది. కస్టమర్ల నుంచి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ తో స్విగ్గీ తన సేవలను విస్తరిస్తూ పోయింది. ఇప్పుడు మరో కొత్త సేవలను ప్రారంభించింది. ఆ సేవలు ఎవరి కోసం అంటే జంతు ప్రియుల కోసం. స్విగ్గీ పాలీస్ పేరిట కొత్త సేవలను ప్రారంభించింది. తప్పిపోయిన పెట్స్‌ను వెతికి తెచ్చేందుకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా పెంపుడు జంతువులు ఎప్పుడైనా తప్పిపోతే పెట్ పేరెంట్స్ ఓ రకమైన క్షోభకు గురవుతుంటారు. ఆఖరికి ఎవరైనా వెతికి పెడితే నజరానా ఇస్తామని ప్రకటిస్తుంటారు.

Swiggy

కానీ ఇప్పుడు స్విగ్గీ పాలీస్ సేవల ద్వారా తప్పిపోయిన జంతువుల వివరాలతో స్విగ్గీ యాప్ లో కంప్లైంట్ చేయొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే స్విగ్గీకి చెందిన డెలివరీ పర్సన్స్ తప్పిపోయిన జంతువులను గుర్తించి వాటి వివరాలను, లొకేషన్ ను స్విగ్గీ టీమ్ కు అందిస్తారు. వారు వెంటనే ఆవివరాలను పెట్ పేరెంట్స్ కు చేరవేస్తారు. ఈ కొత్త సేవలతో తప్పిపోయిన జంతువులను డెలివరీ పార్ట్ నర్స్ సాయంతో గుర్తించి వారికి అందిస్తారు. కాగా ఏప్రిల్ 11న జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం సందర్భంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించింది స్విగ్గీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి