Trains Cancelled In Telangana: ప్రయాణికులకు అలెర్ట్.. నెల రోజులు ఆ రూట్లలో రైళ్ల సేవలు బంద్!

ప్రయాణికులకు అలెర్ట్.. నెల రోజులు ఆ రూట్లలో రైళ్ల సేవలు బంద్!

Few Trains Cancelled In Telangana: రైళ్ల ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్య స్థానాలకు చేరుతుంటారు.ఇదే సమయంలో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ కీలక సమాచారం అందిస్తుంది.

Few Trains Cancelled In Telangana: రైళ్ల ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్య స్థానాలకు చేరుతుంటారు.ఇదే సమయంలో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ కీలక సమాచారం అందిస్తుంది.

ప్రజలు వినియోగించే రవాణ వ్యవస్థల్లో రైల్వే ఒకటి. వీటి ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్య స్థానాలకు చేరుతుంటారు. అంతేకాక టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండటంతో వీటిల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ కీలక సమాచారం అందిస్తుంది. వివిధ కారణాలతో రద్దయ్యే రైళ్లు, దారి మళ్లీంచే రైళ్ల వివరాలను తెలియజేస్తుంది. తాజాగా తెలంగాణాలోని రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక సమాచారం వెల్లడించింది.  కొన్ని రైళ్ల సేవలను రద్దు చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వేశాఖ కీలక సమాచారం ఇచ్చింది. ఈ డిజిజన్ పరిధిలోని కాజీపేట, సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య రామగుండం నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్‌, సూపర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నెలరోజుల పాటు రద్దుచేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక కారణాలతో వీటిని శనివారం నుంచి నిలిపివేశారు. అదే విధంగా మరికొన్ని రైళ్లను దారిమళ్లించి నడిపిస్తున్నారు. సాంకేతిక సమస్యలు ఏమిటనే వివరాలు ప్రకటించనప్పటించలేదు. అయినప్పటికీ సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు జరుగుతున్నట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు.

ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద జరిగిన కోరమాండల్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు సిగ్నలింగ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఆధునికీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాజీపేట్, సిర్పూర్ కాగజ్ నగర్ రూట్ల లో కూడా ఈ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక రద్దన రైళ్ల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారి వెబ్ సైట్ లో పొందుపర్చింది.  కాజీపేట-కాగజ్‌నగర్ మధ్య నడిచే 17003 రైలును జూన్ 17 నుంచి జులై6 వరకు రద్దు చేశారు. కాగజ్‌ నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ను కాజీపేట్ మధ్య నడిచే 12757/58 రెండు రైళ్లను జూన్ 23 నుంచి జులై 6 వరకు రద్దు చేశారు. చైన్నై-జైపూర్‌ 12967 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈనెల 23,25,30 , జులై 2,7 తేదీల్లో రద్దు చేశారు. అదే విధంగా జైపూర్‌-చెన్నై మధ్య నడిచే జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌  రైలు 12968ను రద్దు చేశారు.

మైసూర్‌-జైపూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ 12975 రైలును ఈనెల 27,29,జులై 4,6 తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. యశ్వంత్‌పూర్‌-లక్నో రైలును(12539) జూన్ 26, జులై 3న రద్దైంది. అదే విధంగా లక్నో-యశ్వంత్‌పూర్‌(12540)ఈ నెల 28, జులై 5 తేదీల్లో, భాగ్‌మతి-మైసూర్‌ సూపర్‌ ఫాస్ట్‌(12577) జూన్ 28 , వచ్చే నెల 5న తేదీల్లో రద్దయ్యాయి. బిలాస్‌పూర్‌-త్రివేండ్రం మధ్య నడిచే తిరునవెల్లి ఎక్స్‌ప్రెస్‌ 22619ను జూన్ 25, జులై 2 వరకు రద్దు చేశారు. అలానే త్రివేండ్రం- బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌(22620) ఈ నెల 23,30 తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. పాటలీపుత్ర, శ్రీమాత వైష్ణో మధ్య నడిచే రెండువైపుల రైళ్లను ఈ నెల 21, 24, 28 , జులై1, 5,8 తేదీల్లో సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. ఈ సమాచారం గమనించి..ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Show comments