iDreamPost

సచివాలయంలోని ఆరో అంతస్తు నుంచి దూకిన రైతులు..

సచివాలయంలోని ఆరో అంతస్తు నుంచి దూకిన రైతులు..

దేశానికి వెన్నుముక రైతేనని, ఆయన లేకుంటే దేశం ఉండదంటూ రైతుల గురించి ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఉపన్యాసాలు ఇస్తుంటారు.  రైతును కాపాడుకోవడం మన బాధ్యత అంటూ ఎమోషన్ల్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే రైతులు కష్టాల్లో ఉంటే ఆదుకునే వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. ప్రభుత్వాలు కూడా కొన్ని కొన్ని విషయాల్లో రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ క్రమంలో తమ బాధను ప్రభుత్వానికి తెలియజేయడానికి నిరసనలు తెలియజేస్తుంటారు. తాజాగా మహారాష్ట్రలోని రైతులు సచివాలయంలోని ఆరో అంతస్తు నుంచి రైతులు దూకేశారు. ప్రస్తుతం ఈ రైతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహారాష్ట్ర లో రైతులు నిరసనకు దిగారు. ఆనకట్ట నిర్మాణంలో కోల్పోయిన భూములకు పరిహారాన్ని పెంచాలని కోరుతూ రైతులు వినూత్నం నిరసనకు దిగారు. అమరావతి జిల్లా మోర్షిలోని అప్పర్ వార్ధా అనకట్ట నిర్మాణం కోసం ప్రభుత్వం భూమి సేకరించింది. అయితే  భూములకు అధిక నష్ట పరిహారం, నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రైతుల డిమాండ్  చేస్తున్నారు.  ఈ క్రమంలోనే వినూత్న నిరసనకు దిగారు.  ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నినాదాలు చేస్తూ, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు.. కొంతమంది రైతులను అదుపులోకి తీసుకున్నారు.

మరికొందరు రైతులు.. పోలీసుల వలయాన్ని తప్పించుకుని సచివాలయ ఆరో భవనంపైకి వెళ్లారు. అక్కడి నుంచి చాలా మంది రైతులు కిందకి దూకారు. అయితే అదృష్టం బాగుండి.. అక్కడే ఏర్పాటు చేసిన వలలో పడ్డారు. ఆత్మహత్యలను నిరోధించడానికి కొంతకాలం క్రితం తొలి అంతస్తు భాగంలో భారీ రక్షణ  వలను  అధికారులు ఏర్పాటు చేశారు.  ఆ వలే.. రైతులను కాపాడిందని స్థానిక అధికారులు తెలిపారు.  ఆరో అంతస్తుపై నుంచి దూకిన రైతులు ఎవ్వరికి ఎటువంటి గాయాలు కాలేదు. వలపై పడిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నిరసనకు దిగిన రైతులందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలి.. కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి… రైతులు చేస్తున్న డిమాండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి