Farmer's Daughter: 170 ఏళ్లలో ఎవరి వల్ల కాని రికార్డు సాధించిన ఈ రైతు బిడ్డ గురించి తెలుసా?

170 ఏళ్లలో ఎవరి వల్ల కాని రికార్డు సాధించిన ఈ రైతు బిడ్డ గురించి తెలుసా?

Farmer's Daughter: 170 ఏళ్లలో ఎవరి వల్ల కాని రికార్డుని ఒక రైతుబిడ్డ సృష్టించారు. 170 ఏళ్ల చరిత్రని తిరగరాశారు. పేదరికంలో పుట్టి పేదరికాన్ని జయించి ఇవాళ పెద్దరికంతో ఆమె ప్రజా సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Farmer's Daughter: 170 ఏళ్లలో ఎవరి వల్ల కాని రికార్డుని ఒక రైతుబిడ్డ సృష్టించారు. 170 ఏళ్ల చరిత్రని తిరగరాశారు. పేదరికంలో పుట్టి పేదరికాన్ని జయించి ఇవాళ పెద్దరికంతో ఆమె ప్రజా సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని అంటారు. పేదరికంలో పుట్టచ్చు గాక కానీ ఆ పేదరికాన్ని జయించి పెద్దరికాన్ని నిలబెట్టుకునే శక్తి ఎవరికి వాళ్ళే సమకూర్చుకోవాలి. పేదరికం నుంచి పెద్దరికానికి ఎదగడం అనేది అందరికీ సాధ్యం కాదు. చాలా తక్కువ మందికి మాత్రమే అది సాధ్యపడుతుంది. అలాంటి వారిలో ఈ రైతు బిడ్డ ఒకరు. ఈమె 170 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. అసలు అప్పటి వరకూ ఏ మహిళ వల్ల సాధ్యం కానిది ఈమె చేసి చూపించారు. ఒక కొత్త చరిత్రను లిఖించారు. 1790 తర్వాత ఆ జిల్లాకి మహిళా కలెక్టర్ రావడం అదే తొలిసారి. 170 ఏళ్లలో అప్పటి వరకూ ఒక్క మహిళా కలెక్టర్ కూడా లేరు. ఈమె రాకతోనే ఆమె ఆ జిల్లాకు మొదటి కలెక్టర్ అయ్యారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారికి ఈమె కథ స్ఫూర్తిగా నిలుస్తుంది. 

అనగనగా మహారాష్ట్రలోని ఒక గ్రామం. ఆ గ్రామంలో రైతు కుటుంబంలో ఒక పాప జన్మించింది. ఆ పాప కుటుంబం చిన్నప్పటి నుంచి పేదరికాన్ని అనుభవించింది. ఆమెకు 9 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తండ్రి పడే స్ట్రగుల్స్ ని ఆ పాప కళ్లారా చూసింది. రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఆమె తండ్రికి రాకపోవడంతో కుటుంబంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. అప్పుడు ఆ పాప తన తండ్రిని ఇలా అడిగింది. ప్రభుత్వం నుంచి రైతులకు పథకాల డబ్బులు రావాలంటే ఎవరు మంజూరు చేయాలి అని తొమ్మిదేళ్ల వయసులో ఆ పాప అడిగింది. ఆ పాప పేరే రోహిణి పి. భాజీభాకరే. ఆమె తండ్రి పడుతున్న కష్టాన్ని ఆమె ఆదర్శంగా తీసుకుని ఆమె ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పట్టుబట్టారు. పబ్లిక్ సర్వీస్ మీద ఫోకస్ చేశారు. తాను కలెక్టర్ అయితే పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తా అని ఒట్టు వేసుకున్నారు. అలా ఆమె తన విద్యాభ్యాసాన్ని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలోనే పూర్తి చేశారు.

ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే ఆమె సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ని క్లియర్ చేశారు. తమిళనాడులోని సాలెం జిల్లాకు మొట్టమొదటి మహిళా కలెక్టర్ గా ఆమె నియమితులయ్యారు. 170 ఏళ్లలో ఏ ఒక్క మహిళ కూడా కలెక్టర్ అయ్యింది లేదు. కానీ ఒక రైతుబిడ్డ ఈ అరుదైన చరిత్ర సృష్టించారు. మధురైలోని జిల్లా రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ లో అడిషనల్ కలెక్టర్ గా, ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పని చేశారు. అస్సలు సమయాన్ని వృధా చేసేవారు కాదు.. సమయం కుదిరినప్పుడల్లా విద్యార్థులకు 1వ తరగతి, రెండో తరగతి, మూడో తరగతి విద్యార్థులకు తమిళంలో, ఇంగ్లీష్ లో పాఠాలు చెప్పేవారు. మెటర్నిటీ లీవ్ తర్వాత ఈమె తిరునెల్వేలిలోని చేరన్మహాదేవి సబ్ కలెక్టర్ గా పోస్టింగ్ వేశారు. 2017లో ఆమె మళ్ళీ సేలం కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. 2022లో జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ గా కూడా పని చేశారు. అలా ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఆమె ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా ప్రజా సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు.

Show comments