Viral Video: వీడియో: సెలూన్ షాపులో ఉమ్ముతో ఫేస్ మసాజ్! వీడు అసలు మనిషేనా?

వీడియో: సెలూన్ షాపులో ఉమ్ముతో ఫేస్ మసాజ్! వీడు అసలు మనిషేనా?

మగవాళ్లకు గర్భం, ఆడవాళ్లకు గడ్డం రాదురోయ్ అంటుంటారు. ఏదీ ఏమైనా అబ్బాయిలు తమకు గడ్డమే అందం అని భావిస్తుంటారు. అప్పుడప్పుడు కాస్తంత జుట్టు, గడ్డం తీసుకునేందుకు సమీపంలోని సెలూన్ షాపుకు వెళుతుంటారు. ఈ సారి కూడా అదే ప్లానులో ఉంటే.. ఈ వీడియో చూడండి

మగవాళ్లకు గర్భం, ఆడవాళ్లకు గడ్డం రాదురోయ్ అంటుంటారు. ఏదీ ఏమైనా అబ్బాయిలు తమకు గడ్డమే అందం అని భావిస్తుంటారు. అప్పుడప్పుడు కాస్తంత జుట్టు, గడ్డం తీసుకునేందుకు సమీపంలోని సెలూన్ షాపుకు వెళుతుంటారు. ఈ సారి కూడా అదే ప్లానులో ఉంటే.. ఈ వీడియో చూడండి

అమ్మాయిలు, మహిళలే కాదు.. అబ్బాయిలు, పురుషులు కూడా అలంకార ప్రియులే. తమ అందానికి కాస్తంత మెరుగులు దిద్దుకునేందుకు అప్పుడప్పుడు సెలూన్, మసాజ్ సెంటర్స్‌కు వెళుతుంటారు. అక్కడకు వెళ్లి.. కుర్చీలో కూర్చుని షేవింగ్ చేయించుకోవడంతో పాటు ఫేసియల్, మసాజ్‌లు చేయించుకుంటారు. బార్చర్ వారిని కుర్చీలో కూర్చోబెట్టి.. కస్టమర్ చెప్పినట్లు చేస్తుంటాడు. అద్దంలో కస్టమర్ ఆ మెరుగులు దిద్దడాన్ని చూసి కరెక్షన్ చేయడంతో పాటు తనలో వస్తున్న మార్పుల్ని చూసి మురిసిపోతుంటాడు. అదే ఫేసియల్, మసాజ్ చేస్తున్న సమయంలో.. కళ్లు మూసుకుని ఉండిపోతుంటాడు కస్టమర్స్. అప్పుడు అతడు వాడిన పరికరాలు, వినియోగించే ప్రొడక్ట్స్ కూడా తెలియదు. బార్చర్ చేస్తున్న టెక్నీక్‌కు కొంత మంది నిద్రలోకి జారుకుంటారు కూడా.

ఇదిగో ఓ కస్టమర్ కూడా తన మొఖానికి ఫేసియల్ చేయాలంటూ ఓ బార్చర్ షాపుకు వెళ్లాడు. వెళ్లి తన ముఖాన్ని బార్చర్ కు అప్పజెప్పాడు. మొఖానికి మొత్తం క్రీములు రాసి.. మసాజ్ చేశాడు సెలూన్ సెంటర్ యజమాని. అంతలో చేతిలో ఉమ్ముతీసుకుని.. కస్టమర్ ఫేసుకు రాసి.. రుద్దాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేసింది. దీంతో సెలూన్ సెంటర్లలో ఈ రకమైన మసాజ్ జరుగుతుందా అని ఆందోళన చెందారు పురుషులు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. చివరకు నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

యూపీలోని షామ్లీలో బార్బర్ అమ్జాద్ నడుపుతున్న సెలూన్ షాపుకు వెళ్లాడో కస్టమర్. ఫేస్ మసాజ్ చేయాలని కోరగా.. ఏవో క్రీములు రాసి.. తన చేతులతో మసాజ్ చేయడం ప్రారంభించాడు. అంతలో చేతిలోకి ఉమ్ము వేసుకుని ముఖానికి అప్లై చేసి రుద్దాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అమ్జాద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడ్ని అరెస్టు చేశారు పోలీసులు. అతడు గతంలో కూడా ఇలాంటి వికృత చేష్టలే చేసినట్లు తేలింది. కస్టమర్‌కు ఫేస్ మసాజ్, ఫేస్ ప్యాక్ చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఉమ్మి వేసి వారి ముఖాలకు అమ్జాద్ రాస్తున్నాడని తేలింది. ప్రస్తుతం అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాబోయ్ అంటున్నారు.

Show comments