క్రికెట్ లో విషాదం.. AP మూలాలున్న ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ మృతి!

క్రికెట్ లో విషాదం.. AP మూలాలున్న ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ మృతి!

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మాజీ రిఫరీ రామన్ సుబ్బా రో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రపంచ క్రికెట్ లో ఎన్నో పదవుల అలంకరించిన ఈయన.. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న వ్యక్తి కావడం విశేషం.

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మాజీ రిఫరీ రామన్ సుబ్బా రో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రపంచ క్రికెట్ లో ఎన్నో పదవుల అలంకరించిన ఈయన.. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న వ్యక్తి కావడం విశేషం.

ప్రపంచ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ మాజీ దిగ్గజ క్రికెటర్, ఐసీసీ మాజీ రిఫరీ రామన్ సుబ్బా రో(92)గురువారం మరణించినట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. సుబ్బా రో ఇంగ్లండ్ తరఫున 1958-61 మధ్యలో 13 టెస్టులు ఆడాడు. ఇక ఫస్ట్ క్లాస్, కౌంటీ క్రికెట్ లో అయితే సుబ్బా రోకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులో అనేక పదవులు అధిరోహించిన ఆయన ఏపీ మూలాలు ఉన్న వ్యక్తి కావడం గర్వకారణం.

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మాజీ రిఫరీ రామన్ సుబ్బా రో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు పైబడటం, దీర్ఘకాలిక అనారోగ్య కారణాల చేత ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. సుబ్బా రో 1958-61 మధ్య ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు ఆడి.. 46.85 సగటుతో 984 పరుగులు చేశాడు. ఇక తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో సర్రే, నార్తంఫ్టన్ ఫైర్ కౌంటీల తరఫున 260 మ్యాచ్ లు ఆడి.. 30 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలతో 14,182 రన్స్ చేశాడు. ఇక పార్ట్ టైమ్ లెగ్ స్పిన్నర్ గా 87 వికెట్లు తీశాడు.

ఇదిలా ఉండగా.. సుబ్బా రో ఇంగ్లండ్ టెస్ట్-కౌంటీ క్రికెట్ బోర్డుకు చైర్మన్ గా 1985-1990 మధ్యలో వ్యవహరించాడు. ఆయన మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్, ఐసీసీ సంతాపం తెలియజేశాయి. కాగా.. రామన్ సుబ్బా రో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న వ్యక్తే. ఆయన తండ్రి పంగులూరి వెంకట సుబ్బారావు ఏపీలోని బాపట్లకు చెందినవారు. ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లి.. అక్కడే డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పుట్టిన సంతానమే రామన్ సుబ్బా రో.

Show comments