England vs Oman: ఒక్క మ్యాచ్‌తో లెక్కలన్నీ మార్చేసిన ఇంగ్లండ్‌! 3 ఓవర్లలో మ్యాచ్‌ ఫినిష్‌

England vs Oman: ఒక్క మ్యాచ్‌తో లెక్కలన్నీ మార్చేసిన ఇంగ్లండ్‌! 3 ఓవర్లలో మ్యాచ్‌ ఫినిష్‌

England vs Oman, T20 World Cup 2024: వరల్డ్‌ కప్‌ టోర్నీలో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తమ సత్తా ఏంటో చూపించింది. పసికూనపై ప్రతాపం చూపిస్తూ.. మ్యాచ్‌ను 3 ఓవర్లలోనే ముగించింది. ఆ మ్యాచ్‌ విశేషాలు ఇలా ఉన్నాయి..

England vs Oman, T20 World Cup 2024: వరల్డ్‌ కప్‌ టోర్నీలో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తమ సత్తా ఏంటో చూపించింది. పసికూనపై ప్రతాపం చూపిస్తూ.. మ్యాచ్‌ను 3 ఓవర్లలోనే ముగించింది. ఆ మ్యాచ్‌ విశేషాలు ఇలా ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో నిల్చి ఉండాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జూలు విదిల్చింది. గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటికి వెళ్లకుండా ఉండాలన్నా.. సూపర్‌ 8కు వెళ్లాలన్నా.. మైనస్‌లో ఉన్న రన్‌రేట్‌ను ప్లస్‌లోకి తీసుకురావాలని పసికూనపై ప్రతాపం చూపారు. ఇంగ్లండ్‌ దెబ్బకు మ్యాచ్ మూడు ఓవర్లలోనే ముగిసిపోయింది. పసికూన ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తమ పంజా విసిరింది. తొలుత ఒమన్‌ను 47 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఇంగ్లండ్‌.. ఆ టార్గెట్‌ను 19 బంతుల్లోనే ఛేదించి.. ఊహించని విధంగా రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. అయితే.. ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఓడిపోతేనే.. ఇంగ్లండ్‌కు సూపర్‌ ఛాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఉన్న ఫామ్‌లో స్కాట్లాండ్‌ గెలిచే పరిస్థితి కూడా లేదు. దీంతో.. ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌ నమీబియాతో ఆడనుంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిస్తే.. పాయింట్లతో పాటు రన్‌రేట్‌ మరింత పెరగనుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ జట్టు దారుణంగా 47 పరుగులకే కుప్పకూలింది. జట్టులోని 10 మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే అవుట్‌ అయ్యాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌ వుడ్‌ నిప్పులు చెరిగారు. వారికి ఆదిల్‌ రషీద్‌ కూడా తోడయ్యాడు. వీరి దెబ్బకు ఒమన్‌ వణికిపోయింది. ఒమన్‌ వికెట్లు టపటపా పడిపోయాయి. మొత్తంగా 13.2 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది ఒమన్‌. ఆ టీమ్‌లో షోయబ్‌ ఖాన్‌ ఒక్కడే 11 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా.. 5, 9, 8, 1, 1, 1, 0, 2, 5, 0 వరుసగా ఈ స్కోర్లు చేశారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో టోప్లీ ఒక్కడే వికెట్‌ దక్కలేదు. జోఫ్రా ఆర్డర్‌ 3, మార్క్‌ వుడ్‌ 3, ఆదిల్‌ రషీద్‌ 4 వికెట్లు పడగొట్టారు. ఇక 48 పరుగులు టార్గెట్‌తో బరిలోకి ఇంగ్లండ్‌ రన్‌రేట్‌ కోసం.. ఒమన్‌ బౌలర్లపై విరుచుకుపడింది. ఇంగ్లండ్‌ ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ 3 బంతుల్లో 2 సిక్సులతో 12, జోస్‌ బట్లర్‌ 8 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 24 పరుగులు చేశారు. వేగంగా ఆడే క్రమంలో సాల్ట్‌ అవుటైనా ఇంగ్లండ్‌కు ఫరక్‌ పడలేదు. విల్‌ జాక్స్‌ 5, బెయిర్‌ స్టో 2 బంతుల్లో 8 పరుగులు చేశాడు. మొత్తంగా 19 బంతుల్లో అంటే 3.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ తమకు కావాల్సిన రన్‌రేట్‌ను సాధించుకుని.. భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ రన్‌రేట్‌ +3.081గా ఉంది. నమీబియాపై గెలిస్తే ఈ రన్‌రేట్‌ మరింత పెరగనుంది. మరి ఒమన్‌పై ఇంగ్లండ్‌ సాధించిన బంపర్‌ విక్టరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments