Musk Says Apple Not Safe: యాపిల్ ఉత్పత్తులను బ్యాన్ చేయాలంటున్న ఎలాన్ మస్క్.. కారణం ఏంటంటే?

యాపిల్ ఉత్పత్తులను బ్యాన్ చేయాలంటున్న ఎలాన్ మస్క్.. కారణం ఏంటంటే?

Elon Musk Says Apple Devices Not Safe: ఐఫోన్ సేఫ్ కాదా? ఎలాన్ మస్క్ ఐఫోన్ సురక్షితం కాదని అనడానికి కారణం ఏంటి? ఐఫోన్ మాత్రమే కాదు.. యాపిల్ పరికరాలేవీ కూడా సురక్షితం కాదని.. యాపిల్ పరికరాలను తన కంపెనీలో నిషేధిస్తానని హెచ్చరించారు. మస్క్ ఇలా అనడానికి కారణం ఏంటంటే?

Elon Musk Says Apple Devices Not Safe: ఐఫోన్ సేఫ్ కాదా? ఎలాన్ మస్క్ ఐఫోన్ సురక్షితం కాదని అనడానికి కారణం ఏంటి? ఐఫోన్ మాత్రమే కాదు.. యాపిల్ పరికరాలేవీ కూడా సురక్షితం కాదని.. యాపిల్ పరికరాలను తన కంపెనీలో నిషేధిస్తానని హెచ్చరించారు. మస్క్ ఇలా అనడానికి కారణం ఏంటంటే?

ఓపెన్ ఏఐతో భాగస్వామ్యాన్ని ఎప్పుడైతే యాపిల్ దిగ్గజ కంపెనీ ప్రకటించిందో అప్పుడే ఎలాన్ మస్క్ తన యుద్ధాన్ని ప్రకటించారు. తన కంపెనీల్లో యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు, ఐపాడ్స్ వంటి వాటిని నిషేధించాలని ఉద్యోగులను హెచ్చరించారు. ఎక్స్, టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ ఏఐ ఉద్యోగులు త్వరలోనే ఐఫోన్స్, ఐపాడ్స్, మ్యాక్ సిస్టమ్స్ వంటి వాటిని పక్కన పడేయనున్నారు. ఓఎస్ లెవల్ వద్ద యాపిల్.. ఓపెన్ ఏఐతో అనుసంధానమైతే మా కంపెనీల్లో యాపిల్ పరికరాలను నిషేధిస్తామని మస్క్ వెల్లడించారు. ఇది ఏ మాత్రం ఆమోదించతగని భద్రత ఉల్లంఘన కింద వస్తుందని అన్నారు.

కంపెనీ ద్వారం వద్ద విజిటర్స్ యాపిల్ పరికరాలను తనిఖీ చేసి ఫరడే కేజ్ లో ఉంచుతామని అన్నారు. ఫరడే కేజ్ అనేది సెల్యూలర్ సిగ్నల్స్ సహా అన్ని డిజిటల్ సిగ్నల్స్ ని బ్లాక్ చేస్తుంది. దీని వల్ల బయట నుంచి డేటా అనేది కంపెనీల్లోకి రాదు. యాపిల్ కంపెనీకి తమ సొంత ఏఐని డెవలప్ చేసేంత తెలివి లేదని తాను అనుకోవడం లేదని.. సొంతంగా ఓపెన్ ఏఐని డెవలప్ చేసుకుంటేనే భద్రత, గోప్యత ఉంటుందని అన్నారు.  

యాపిల్ పరికరాల్లో చాట్ జీపీటీ అనుసంధానం అవ్వడం అనేది ఎలాన్ మస్క్ కి నచ్చలేదు. ఐఓఎస్ 18, ఐపాడ్ ఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సుక్వోయ సహా పలు ఇతర యాప్స్ లో జీపీటీ 4o-పవర్డ్ సిరి అనేది.. ఎలాంటి అకౌంట్ క్రియేట్ చేసుకోకుండానే డేటా షేర్ చేయడానికి ప్రతిసారి చాట్ జీపీటీ అనుమతి కోరుతుందని యాపిల్ కంపెనీ తెలిపింది. యాపిల్ చాట్ బాట్ పరికరాల్లో చాట్ జీపీటీని అనుసంధానం చేయడానికి ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకుంటామని యాపిల్ కంపెనీ వెల్లడించింది. అదే జరిగితే తాము యాపిల్ పరికరాలను నిషేధిస్తామని ఎలాన్ మస్క్ అన్నారు. ఇలాంటి స్పైవేర్ ని ఆపకపోతే తమ కంపెనీల్లో అన్ని యాపిల్ పరికరాలను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు.

డేటాను ఓపెన్ ఏఐ అందజేస్తే ఫ్యూచర్ లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. యాపిల్ సంస్థ తమ పరికరాల్లో చాట్ జీపీటీని అనుసంధానం చేయడం వల్ల యూజర్ల డేటా గోప్యతకు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని మస్క్ వ్యాఖ్యానించారు. ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట చర్చ నడుస్తోంది. ఏఐతో యాపిల్ పరికరాలు అనుసంధానం అవ్వడం వల్ల ఆ కంపెనీ భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కునే పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు. ఉదాహరణకు మీరు ఐఫోన్ యూజర్లు ఐతే.. మీ ఫోన్ లో డేటా మొత్తాన్ని అటు యాపిల్ కంపెనీ, ఇటు ఓపెన్ ఏఐ రెండూ లాక్కుంటాయని.. అది గోప్యత ఉల్లంఘన అవుతుందని మస్క్ తన అభిప్రాయాన్ని ఒక మీమ్ ద్వారా వెల్లడించారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Show comments