పెళ్లికాని కుర్రాడితో మహిళ ఎంజాయ్! అన్నీ చేసి చివరికి..!

పెళ్లికాని కుర్రాడితో మహిళ ఎంజాయ్! అన్నీ చేసి చివరికి..!

ఈ రోజుల్లో చాలా మంది పెళ్లైన వ్యక్తులు కట్టుకున్న వాళ్లను మోసం చేస్తున్నారు. భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకరు సీక్రెట్ గా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ చివరికి సంసారంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇక అసలు విషయం బయటపడడంతో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం రాచపల్లి గ్రామం. ఇక్కడే ఓ మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు పెళ్లై ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే భర్త ఉపాధి నిమిత్తం భార్య, పిల్లలకు దూరంగా ఉంటూ నెల నెల ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ అదే గ్రామానికి చెందిన పగాడం దుర్గప్రసాద్ (21) అనే పెళ్లికాని యువకుడితో గత రెండేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భర్త దూరంగా ఉండడంతో ఆ వివాహిత ప్రియుడితో ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అలా చాలా కాలం పాటు ఈ ఇల్లాలు తన చీకటి కాపురాన్ని కొనసాగించింది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఆ మహిళ తన పిల్లలతో కలిసి తన పుట్టింటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు దుర్గ ప్రసాద్ ఆమె పుట్టింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఆ యువకుడు ప్రియురాలితో గొడవ పడ్డాడు. దీంతో వీరి చీకటి కాపురం బయటపడింది. ఇక అన్నీ చేసి ఆ మహిళకు చివరికి పరువు గుర్తుకొచ్చింది. వెంటనే ఆ మహిళ దుర్గ ప్రసాద్ ను తమ ఇంటి మెడపైకి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఆ యువకుడి కళ్లల్లో కారం కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న దుర్గ ప్రసాద్ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. అనంతరం ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: కడుపుతో ఉందని కూడా చూడకుండా భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!

Show comments