OTT Suspense Thriller Movie: హ్యాకింగ్ తో ప్రపంచం సర్వనాశనం.. OTTలో ఈ మూవీ ఎలా మిస్ అయ్యారు?

OTT Suspense Thriller Movie: హ్యాకింగ్ తో ప్రపంచం సర్వనాశనం.. OTTలో ఈ మూవీ ఎలా మిస్ అయ్యారు?

కొన్ని సినిమాల గురించి విపరీతమైన బజ్ వచ్చే వరకు తెలియదు.. ఆ సినిమాలు అంత బావుంటాయని. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

కొన్ని సినిమాల గురించి విపరీతమైన బజ్ వచ్చే వరకు తెలియదు.. ఆ సినిమాలు అంత బావుంటాయని. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

మంచి మంచి సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో లెక్క లేనన్ని ఉన్నాయి. చూసే ఓపిక తీరిక ఉండాలి కానీ ఎంత చూసినా ఇంకా చూడాలనే అనిపించేంత కంటెంట్ ఉంది. ఈ క్రమంలో సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఓ బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. పైగా ఈ సినిమా అత్యధిక మంది చూసిన లిస్ట్ లో కూడా ఉంది, మరి ఈ సినిమాను కనుక మిస్ అయితే ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ చేసినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ మూవీ కథేంటంటే.. అమండా తన భర్త పిల్లలతో న్యూ యార్క్ లో నివసిస్తుంది. అయితే అమండాకు మనుషులన్నా వాళ్ళతో కలిసి ఉండడం అన్నా ఇష్టం ఉండదు. దీనితో ఆమె కొద్దీ రోజులు సిటీ లైఫ్ కు దూరంగా వెళ్లాలని అనుకుంటూ ఉంటుంది. దానికోసం ఆన్ లైన్ లో ఓ మారుమూల ఐలాండ్ లోని ఓ హోటల్ బుక్ చేస్తుంది. ఓ వీకెండ్ తన భర్త పిల్లలతో కలిసి అక్కడకు బయల్దేరుతుంది. ఇక ఆ ఫ్యామిలీ ఆ బుక్ చేసిన ఆ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. ఆ గెస్ట్ హౌస్ చూసి ఫ్యామిలీ అంతా హ్యాపీ అవుతారు. కట్ చేస్తే అక్కడ పరిస్థితులన్నీ ఒక్కసారిగా తారుమారు అవుతూ వస్తాయి.

వారికి ఆ గెస్ట్ హౌస్ ను రెంట్ కి ఇచ్చిన ఓనర్, అతని కూతురు ఆరోజు రాత్రి వాళ్ళ ఆ గెస్ట్ హౌస్ కు వస్తారు. తమకు ఆ రాత్రి అక్కడ ఉండడానికి పెర్మిషన్ అడుగుతారు. అమండా కు ఇష్టం లేకపోయినా కానీ.. ఒప్పుకుంటుంది. ఇక సరిగ్గా అప్పుడే గుర్తు తెలియని ఓ హ్యాకింగ్ టీమ్ అన్ని కమ్యూనికేషన్ ప్లాట్ ఫార్మ్స్ ను హ్యాక్ చేసిందనే ప్రకటన వస్తుంది. అమెరికా అంత సైబర్ ఎటాక్ కు గురైంది అని ప్రకటనలు వస్తాయి. దీనితో అసలు సిటీలో ఏం జరుగుతుందో తెలుసుకోడానికి అమండా భర్త సిటీకి వెళ్తాడు. అలాగే ఆ ఇంటి ఓనర్ కూడా బయటకు వెళ్తాడు.. అమాండా పిల్లలు కూడా దగ్గరలో ఉన్న ఓ అడవికి వెళ్తారు. ఈ ముగ్గురుకి కూడా వింత అనుభవాలు ఎదురౌతాయి.

కట్ చేస్తే అక్కడ నుంచి అన్ని వారికి షాకింగ్ కు గురి చేసే సంఘటనలు ఎదురౌతాయి. ఆమె ఇద్దరి పిల్లలు కనిపించకుండా పోతారు , అసలు అక్కడ ఏం జరుగుతుంది ? వారి పిల్లలు ఎం అయ్యారు ? ఆ సైబర్ అటాక్ ను చేసింది ఎవరు ? చివరికి ఈ కథను ఎలా ముగించారు ? ఇవన్నీ తెలియాలంటే.. “లీవ్ ది వరల్డ్ బీహైన్డ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. పైగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments