Best Suspense Thriller Movie In OTT: OTTలో దృశ్యం లాంటి మరో మూవీ! ప్రతి సీన్ లో టెన్షన్ తప్పదు!

Best Suspense Thriller Movie In OTT: OTTలో దృశ్యం లాంటి మరో మూవీ! ప్రతి సీన్ లో టెన్షన్ తప్పదు!

OTT Movie Suggestion: చాలా వరకు ఓటీటీ లోకి వచ్చే సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను మెప్పిస్తునే ఉన్నాయి. ఈ క్రమంలో ఓటీటీ ఉన్న కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేసే అవకాశం ఉంది. మరి మీరు మిస్ చేసిన సినిమాలో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: చాలా వరకు ఓటీటీ లోకి వచ్చే సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను మెప్పిస్తునే ఉన్నాయి. ఈ క్రమంలో ఓటీటీ ఉన్న కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేసే అవకాశం ఉంది. మరి మీరు మిస్ చేసిన సినిమాలో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

ప్రేక్షకులకు చూసే ఓపిక తీరిక ఉండాలే కానీ.. ఓటీటీ లో ఎంత చూసిన తరగని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పటికప్పుడు వస్తున్న సినిమాలను ప్రేక్షకులంతా కూడా మిస్ చేయకుండా చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని పాత సినిమాలను ప్రేక్షకులు మిస్ చేసే అవకాశం ఉంది. అటువంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఈ సినిమాను కనుక మిస్ చేస్తే మాత్రం ఓ మంచి ఇంట్రెస్టింగ్ సినిమాను మూవీ లవర్స్ మిస్ అయినట్లే. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ లవర్స్ కోసం ఈ మూవీ సజ్జెషన్. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథేంటంటే.. మాయ డిసౌజా అనే లేడి ఓ సింగల్ మదర్. ఆమె తన భర్త నుంచి విడిపోయి..పిల్లలతో కలిసి నేపాల్లో ఓ చిన్న రెస్టారెంట్ నడుపుతూ ఉంటుంది. మాయ ఉండే ఫ్లాట్ పక్కనే.. నరేన్ వ్యా స్ అనే ఓ వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. అతను అక్కడే ఉండే ఓ పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే దాదాపు పదిహేనేళ్ల తర్వాత మాయా భర్త ఆమెను కలవడానికి నేపాల్ వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అతను తన కుమార్తె తార ను చూసి.. ఆమెను పెద్ద స్టార్ ను చేస్తానని తనతో పంపించామని మాయను అడుగుతాడు. కానీ అందుకు మాయ ఒప్పుకోదు. ఈ క్రమంలో వారిద్దరి మధ్యన గొడవ పెద్దది అవుతుంది. అతని నుంచి ఆమె కూతురుని రక్షించే క్రమంలో.. హీటర్ వైర్ ను అతని మెడకు చుట్టి చంపేస్తుంది, ఈ ఘటనను పక్కనే ఉన్న నరేన్ చూస్తాడు. మరి హత్య విషయం బయటపడకుండా ఉండేందుకు మాయ ఏం చేసింది ? ఈ క్రమంలో నరేన్ ఆమెకు సహాయం చేస్తాడా లేదా ? ఈ కేసును సాల్వ్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కు ఎలాంటి పరిణామాలు ఎదురౌతాయి ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “జానే జాన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా కథ వింటుంటే తెలుగులో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా అనిపించవచ్చు. తెలిసిన కథే కదా అని లైట్ తీసుకుంటే మాత్రం పొరపడినట్లే. ఎందుకంటే ఈ సినిమాలో అంతకుమించిన ట్విస్ట్ లు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా ఎండ్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం అసలు మిస్ కాకూడదు. పైగా ఈ సినిమాలో మాయ డిసౌజా గా ప్రధాన పాత్ర పోషించింది మరెవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే కనుక వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments