Best Survival Thriller In OTT: 127 గంటలు కొండలు మధ్య ఇరుక్కొనిపోతే! OTTలో సినిమాగా రియల్ స్టోరీ!

Best Survival Thriller In OTT: 127 గంటలు కొండలు మధ్య ఇరుక్కొనిపోతే! OTTలో సినిమాగా రియల్ స్టోరీ!

OTT Movie Suggestion : హారర్, మర్డర్ మిస్టరీస్ లోనే కాకుండా సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలలోనూ కావాల్సినంత సస్పెన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను చూశారా లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion : హారర్, మర్డర్ మిస్టరీస్ లోనే కాకుండా సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలలోనూ కావాల్సినంత సస్పెన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను చూశారా లేదో ఓ లుక్ వేసేయండి.

సర్వైవల్ థ్రిల్లర్స్ ను ఈ మధ్య అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మలయాళ సినిమా అయినా మంజుమ్మేల్ బాయ్స్ ను చూసిన తర్వాత ఇంకా అలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉన్నారు మూవీ లవర్స్. ఈ సర్వైవల్ థ్రిల్లర్స్ అన్ని కూడా యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకుని రూపొందిస్తూ ఉంటారు. దీనితో ప్రేక్షకులు ఆయా సినిమాలను చూసేందుకు మరింత ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను కనుక ఇప్పటివరకు మిస్ అయ్యి ఉంటే కనుక వెంటనే చూసేయండి. మరి ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ముందు ఈ సినిమా కథేంటో చూసేద్దాం.. ఓ సింగిల్ క్యారెక్టర్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది. 2003 లో ఏప్రిల్ లో ఓ సాహస యాత్ర కోసం బయల్దేరతాడు ఓ వ్యక్తి. అప్పటికే ఎన్నో సాహస యాత్రలు చేసి ఉంటాడు. ఈ క్రమంలో గ్రాండ్ క్యానియన్ అనే ఓ ప్రాంతానికి వెళ్లాలని అనుకుంటాడు. ఆ తర్వాత రోజు ఎవరికీ చెప్పకుండా ఒక్కడే.. ట్రిప్ కి కావాల్సిన వస్తువులు తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్తాడు. ఆ క్యానియన్స్ ఉన్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత.. అక్కడ నుంచి తన జర్నీని రికార్డు చేస్తాడు. తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ క్యానియన్స్ ఉన్న ఆ కొండ ప్రాంతానికి చేరుకోడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. కొంతదూరం వెళ్లిన తర్వాత తన దగ్గర ఉన్న సైకిల్ ను పక్కన పెట్టి.. నడుచుకుంటూ ఓ కొండ ఎక్కుతాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ ఇద్దరు అమ్మాయిలు అతనికి పరిచయం అవుతారు. హీరో తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో వారిని ఆకట్టుకుంటాడు.

ఆ ఇద్దరు అమ్మాయిలకు కొండను ఎలా ఎక్కాలో నేర్పిస్తూ ఆ కొండల మధ్యలోకి తీసుకుని వెళ్తాడు. ఇలా వారితో టైమ్ స్పెండ్ చేస్తాడు. దీనితో ఆరోజు జరుగుతున్న పార్టీకి ఆ ఇద్దరు అమ్మాయిలు అతనిని ఇన్వైట్ చేస్తారు. కానీ హీరో వారిద్దరిని పంపించేసి.. తానూ మాత్రం వేరే రూట్ లో ఆ కొండలను ఎక్కుతూ ఉంటాడు. తనకు ఎలానూ ఇవన్నీ అలవాటే కాబట్టి పెద్ద పెద్ద కొండలను కూడా చాలా ఈజీగా ఎక్కిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతను అదుపు తప్పి కిందపడిపోయి రెండు కొండల మధ్య ఇరుకుపోతాడు. తనకు సహాయం చేయడానికి అక్కడ ఎవరు ఉండరు. మరి అతను ఎలా బయటపడతాడు ? ఒక్కడే తనను తానూ ఎలా సేవ్ చేసుకుంటాడు ? అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు ? అతనికి ఎవరైనా సహాయం చేస్తారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే “127 హావర్స్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే ఈ సినిమాను చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments