Best Horror Movie In OTT: OTTలో Home for Rent! దెయ్యాలు కూడా భయపడే ఘోస్ట్ మూవీ ఇది!

Best Horror Movie In OTT: OTTలో Home for Rent! దెయ్యాలు కూడా భయపడే ఘోస్ట్ మూవీ ఇది!

OTT Movie Suggestions: ఏ సినిమాలు చూసిన చూడకపోయినా కానీ హారర్ సినిమాలను మాత్రం అసలు మిస్ చేయకుండా చూడాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ హారర్ మూవీ గురించే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Movie Suggestions: ఏ సినిమాలు చూసిన చూడకపోయినా కానీ హారర్ సినిమాలను మాత్రం అసలు మిస్ చేయకుండా చూడాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ హారర్ మూవీ గురించే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఎంతైనా హారర్ సినిమాలలో ఉన్నంత కిక్ మరే సినిమాలలోను దొరకదు అని భావిస్తూ ఉంటారు హార్రర్ మూవీ లవర్స్. పైగా ఈ హర్రర్ సినిమా జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ వాటిని ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. మేకర్స్ కూడా సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ హర్రర్ సినిమా గురించే. ఈ సినిమాను ఇప్పటివరకు మిస్ చేసి ఉంటే మాత్రం హారర్ జోనర్ లో వచ్చిన ఓ డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను మిస్ అయినట్లే. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథేంటంటే.. ఈ సినిమాలో నింగ్, క్విన్ అనే దంపతులు.. తమ ఏడేళ్ల పాపతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వారికి ఉన్న మరొక ఇంటిని రెంట్ కి ఇద్దాం అని అనుకుంటాడు క్విన్ , కానీ నింగ్ కు ఇష్టంలేదు. అయినా సరే ఒప్పుకుని ఓ రిటైర్డ్ డాక్టర్ , ఆమె కూతురుకి రెంట్ కు ఇస్తుంది. అయితే ఓ రోజు.. నింగ్ తన హస్బెండ్ ఒంటిపైన ఓ టాటూను చూస్తుంది. కట్ చేస్తే అదే టాటూను ఆ ఇంట్లోకి రెంట్ కు వచ్చిన ఆవిడ మెడపై కూడా గమనిస్తుంది. మరోవైపు వారి పొరిగింటి వారు మీ ఇంట్లోకి అద్దెకు దిగిన వారు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వారు ఏవో క్షుద్ర పూజలు చేస్తున్నారు దాని వలన మా కుక్క కూడా చనిపోయింది అని చెప్తుంది. దీనితో నింగ్ కంగారుగా ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పినా కూడా అతను పట్టించుకోడు.

ఇక అప్పటినుంచి వారి ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆమె భర్త కూడా వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. చివరికి తన కూతురు కూడా ఎదో విచిత్రమైన బొమ్మతో ఆడుతూ.. నిద్రపోయేటప్పుడు కూడా పక్కనే పెట్టుకుని పడుకుంటుంది. కట్ చేస్తే తన కూతురు చెస్ట్ పైన కూడా తన భర్త ఒంటిపై ఉన్న లాంటిదే కనిపిస్తుంది. దీనితో ఆమె అనుమానులు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆమెకు అర్థంకాక.. వాళ్ళ పాపాను తీసుకుని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ పాప కనిపించకుండా పోతుంది. వెంటనే ఈమెకు అనుమానం వచ్చి తాను రెంట్ కు ఇచ్చిన ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ ఎవరు కనిపించరు. అసలు అక్కడ ఏం జరుగుతుంది ? వారి ఏడేళ్ల పాపాకు ఏమౌతుంది ? వారి ఇంట్లోకి దిగిన వారు ఎవరు ? ఈ ఫ్యామిలీనే వారు ఎందుకు టార్గెట్ చేశారు ? చివరికి ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే “హోమ్ ఫర్ రెంట్ ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments