Crime Investigation Thriller In OTT: దెయ్యాలని వేటాడే పోలీస్ కథ! ఆహాలో ఇంత మంచి సినిమా ఉందా!

Crime Investigation Thriller In OTT: దెయ్యాలని వేటాడే పోలీస్ కథ! ఆహాలో ఇంత మంచి సినిమా ఉందా!

కొన్ని సినిమాలు చూస్తే నిద్ర కూడా పట్టవు అంత భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం ఓ మంచి సినిమాను మిస్ చేసినట్లే. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

కొన్ని సినిమాలు చూస్తే నిద్ర కూడా పట్టవు అంత భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం ఓ మంచి సినిమాను మిస్ చేసినట్లే. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూసేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. ఇప్పటివరకు ఈ జోనర్ లో వచ్చే సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు చూసి ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూడకపోతే మాత్రం .. ఓ మంచి సినిమాను మిస్ చేసినట్లే. ఇప్పుడు చాలా మంది క్రైమ్, సస్పెన్స్, హర్రర్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీనితో మేకర్స్ కూడా ఆయా కథలను ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. పైగా భాషతో సంబంధం లేకుండా ఆయా సినిమాలకు ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ముందు ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే… పద్మజ అనే మహిళ క్రైమ్ స్టోరీస్ తో.. భారీ రేటింగ్ ను సాధించే ఓ టెలివిజన్ జర్నలిస్ట్. ఆమె తన వివాహ బంధంలో సమస్యలు రావడం వలన విడాకుల కోసం అప్లై చేసుకుంటుంది. ఈ క్రమంలో తన ఐదేళ్ల పాపతో కలిసి ఓ ఇంట్లోకి అద్దెకు దిగుతుంది. అక్కడకు వెళ్లిన దగ్గరనుంచి వారికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురౌతాయి. ఆ ఇంటిలో తనను ఎదో ఆత్మ వెంటాడుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే సరిగ్గా అదే టైమ్ లో తాను ఉండే ప్రాంతంలోని చెరువులో ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసిన పుర్రె ఒకటి బయటపడుతుంది, దీనితో ఆ విషయం మీడియా, సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏసీపీ సత్యజిత్ రంగంలోకి దిగుతాడు. అతను ఈ కేసును ఎలా కొనసాగించాడు ? ఆ పుర్రె ఎవరిదీ ? జర్నలిస్టు మేథా ఇంటిలో ఆత్మల వ్యవహారానికి ఈ కేసుకు ఏదైనా సంబంధం ఉందా ? ఈ కేసులో బయటపడిన వాస్తవాలు ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా పేరు “కోల్డ్ కేస్”. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో తర్వాత ఏం జరుగుతుందా అనే ట్విస్ట్ తో పాటు.. ఆత్మలు వెంటాడే తీరు ప్రేక్షకులకు భయాన్ని కూడా కలిగిస్తుంది. చివరి వరకు కూడా ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments