Weekend Suggestion: ఈ వారం OTT లో మస్ట్ వాచ్ 5 మూవీస్ ఇవే.. ఒక్కో సినిమా ఒక్కో డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్

Weekend Suggestion: ఈ వారం OTT లో మస్ట్ వాచ్ 5 మూవీస్ ఇవే.. ఒక్కో సినిమా ఒక్కో డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్

ప్రతి వారంలానే ఈ వారం కూడా ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చేశాయి. మరి వాటిలో అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో .. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ప్రతి వారంలానే ఈ వారం కూడా ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చేశాయి. మరి వాటిలో అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో .. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

అటు థియేటర్స్ లో చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు .. కాబట్టి ఖచ్చింతంగా అందరి చూపు ఓటీటీ వైపే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటీటీ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాయి. అయితే వాటిలో ముఖ్యంగా తెలుగు సినిమాలు ఏం ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. వారికోసమే ఈ వీకెండ్ సజ్జెషన్. ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలలో కేవలం కొన్ని మాత్రమే చూడదగిన సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం చూడదగిన సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయిన కొద్దీ రోజులకే ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. మరి ఈ వారం అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో చూసేద్దాం.

ఆరంభం:

ఈ సినిమా మే 10 న థియేటర్ లో రిలీజ్ కాగా, మే 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు.. సరి కొత్త ట్విస్టులతో దేజవు కాన్సెప్ట్ ను ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఈ సినిమాను మిస్ కాకుండా చూడాల్సిందే.

రత్నం:

ఏప్రిల్ 26 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్ లో మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. డీసెంట్ కలెక్షన్స్ తో థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని.. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. పైగా అనుకున్న టైమ్ కంటే ముందే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమా మే 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రసన్నవదనం:

సరికొత్త కథనాలతో ప్రేక్షకులను మెప్పించడంలో ముందుంటాడు సుహాస్. ఈ క్రమంలోనే మే 3 న థియేటర్ ఓ రిలీజ్ అయినా ఈ సినిమా.. నెల రోజులలోపే ఓటీటీ లోకి వచ్చేసింది. మే 24 నుంచి ఈ సినిమా ఆహ లో స్ట్రీమింగ్ కానుంది.  ఆహ గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు మాత్రం ఈరోజు నుంచే అందుబాటులోకి రానుంది. థియేటర్ లో డీసెంట్ టాక్ ను సంపాదించుకుని.. త్వరగా ఓటీటీ లోకి వస్తున్న ఈ సినిమా ఎంతమందిని ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

క్రూ :

కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ తో పాటు సీనియర్ నటి టబు నటించిన చిత్రం క్రూ. ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ కి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. థియేటర్ లో భారీ కలెక్షన్స్ తో పాటు భారీ స్పందన పొందిన ఈ సినిమా మే 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఆక్వామెన్ 2:

ఈ సినిమా 2023 డిసెంబర్ 22 న థియేటర్ లో రిలీజ్ చేయగా.. మొదటినుంచి కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.ఎట్టకేలకు ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. పైగా ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ, కన్నడ , తమిళం భాషలలో ఓటీటీ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. జియో సినిమాలో మే 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

మరి ఈ వారం ఈ సినిమాలను అస్సలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments