Mahesh Babu: మరో కొత్త బ్రాండ్‌కు అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు!

మరో కొత్త బ్రాండ్‌కు అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు!

గుంటూరు కారంతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమా పట్టాలెక్కేందుకు కొంత సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో యాడ్స్ చేస్తున్నాడు మహి.

గుంటూరు కారంతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమా పట్టాలెక్కేందుకు కొంత సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో యాడ్స్ చేస్తున్నాడు మహి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కేవలం తెలుగు సినిమాలతోనే స్టార్ డమ్ తెచ్చుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవల్లో క్రేజీ హీరోగా మారాడు. ఈ ఏడాది గుంటూరు కారంతో హిట్ అందుకున్నాడు ఈ మిల్కీ బాయ్. దర్శక ధీరుడు రాజమౌళితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సినిమా ప్రీ పొడక్షన్ వర్క్‌లో ఉండగానే ట్రెండింగ్ సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు మహేష్. వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి విదితమే. ఎస్ఎస్ఎంబీ 29 మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కబోతుంది. ఇదిలా ఉంటే..ప్రస్తుతం ఇటు సినిమాలతో పాటు మరో వైపు యాడ్స్ చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు మహి.

ఒక వైపు మూవీస్ చేస్తూనే వరుస యాడ్స్‌లో దర్శనమిస్తున్నాడు సూపర్ స్టార్. సంతూర్ సోప్ యాడ్, ఎవరెస్ట్, మౌంటైన్ డ్యూ వంటి వాటితో గతంలో కొలబ్రేట్ అయ్యాడు. అలాగే తాజాగా అభి బస్ కోసం చేసిన వీడియో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ యాడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. మౌంటైన్ డ్యూ సరికొత్త ప్రకటనల్లో కూడా న్యూలుక్స్ తో మెస్మరైజ్ చేశాడు. అలాగే ఫోన్ పే మనీ ట్రాన్జక్షన్స్‌కు మహేష్ తన వాయిస్ శాంపిల్ ఇచ్చిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో సంస్థ దక్షిణాది స్టార్ హీరోతో జతకట్టి.. బిజినెస్ పెంచుకునే పనిలో పడింది. ప్రముఖ ఇన్నర్ వేర్ సంస్థ, బనియన్ కంపెనీ డాలర్ .. తన వ్యాపారాన్ని దక్షిణ భారత దేశంలో విస్తరించేందుకు ప్రయత్నిస్తుంది.

రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా 50 కొత్త స్టోర్లను తెరవాలని యోచిస్తుంది. దక్షిణాదిలో మార్కెట్ పెంచుకునేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది కంపెనీ. ప్రస్తుతం దేశంలో డాలర్‌కు 15 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇప్పుడు 11 నుండి 12 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే దేశీయ ఆదాయంలో 8 శాతం వాటా దక్షిణాది ప్రాంతం నుండి ఉండగా.. ఇప్పుడు 20 శాతం వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నామని డాలర్ ఇండస్ట్రీస్ ఎండి వినోద్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఈ విస్తరణ 2025-26 నాటికి  2,000 కోట్ల రూపాయల  మైలురాయిని చేరుకోవడానికి కూడా సహాయపడుతుందని కంపెనీ అధికారులు తెలిపారు. ఇటు రాజమౌళి సినిమా స్టార్ కావడానికి కొంత గ్యాప్ దొరకడంతో.. ప్రకటనలు మడతపెట్టేస్తున్నాడు ఈ గుంటూరు కారం.

Show comments