Doll Marriages: ఊరు బాగుకోసం పిల్లలు చేసిన పని.. సంతోషంలో పెద్దలు!

ఊరు బాగు కోసం పిల్లలు చేసిన పని.. సంతోషంలో పెద్దలు!

Doll Marriages: గ్రామాల్లో సిరిసంపదలు పెరిగేందు, వర్షాలు కురిసేందుకు అనేక రకాల వేడుకలు నిర్వహిస్తుంటారు. అలానే వివిధ రకాల వింత వ్యాధులు గ్రామాల్లో ప్రభలకుండా  ఉండేదుకు వింత కార్యక్రమాలు జరుపుతుంటారు.

Doll Marriages: గ్రామాల్లో సిరిసంపదలు పెరిగేందు, వర్షాలు కురిసేందుకు అనేక రకాల వేడుకలు నిర్వహిస్తుంటారు. అలానే వివిధ రకాల వింత వ్యాధులు గ్రామాల్లో ప్రభలకుండా  ఉండేదుకు వింత కార్యక్రమాలు జరుపుతుంటారు.

ప్రపంచంలో అనేక రకాల అచారా వ్యవహారాలు ఉంటాయి. ముఖ్యంగా గ్రామాల్లో సిరిసంపదలు పెరిగేందు, వర్షాలు కురిసేందుకు అనేక రకాల వేడుకలు నిర్వహిస్తుంటారు. అలానే వివిధ రకాల వింత వ్యాధులు గ్రామాల్లో ప్రభలకుండా  ఉండేదుకు వింత కార్యక్రమాలు జరుపుతుంటారు. అయితే అదే విధంగా ఓ గ్రామానికి చెందిన పిల్లలు.. ఆ ఊరి మంచి కోసం చేసిన ఓ పనికి ..పెద్దలు సంబర పడిపోయారు. తమ పిల్లలు అంత గొప్ప పని చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మరి.. ఆ పిల్లలు చేసిన పని ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఉమ్మడి అదిలాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ గిరిజన గ్రామాలు, తండాలు ఎక్కువగా ఉంటాయి. అలానే తెలంగాణలోనే అదిలాబాద్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలానే ఈ జిల్లాలలోని మారు మూల గ్రామాలు ఆచారాల వ్యవహారాలకు పెట్టింది పేరుగా ఉన్నాయి. ఇక్కడి గ్రామాల ప్రజలు తమ పూర్వీకుల నుంచి వచ్చే సంప్రదాయాలను పాటిస్తూ వినూత్నంగా నిలుస్తున్నారు. గ్రామాల రక్షణ కోసం, పంటలు పుష్కలంగా పండేందుకు అనేక  గ్రామ వేడుకలు నిర్వహిస్తుంటారు. అలానే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని కౌటాల మండంలోని పలు గ్రామాల్లో కొన్నేళ్ల నుంచి బొమ్మలకు పెళ్లిళ్లు చేసే సంప్రదాయం వస్తుంది‌. అయితే ఏదో బొమ్మల పెళ్లిళ్లు కదా అని తూతు మంత్రంగా చేయరు. నిజమైన పెళ్లి చేసినట్లుగానే ఎంతో అట్టహాసంగా ఈ బొమ్మల పెళ్లి చేస్తారు ఈ గ్రామాల ప్రజలు.

ఇటీవలే కౌటాల మండలం తాటిపల్లి గ్రామంలో అట్టహాసంగా బొమ్మల పెళ్ళి జరిగింది. ఊర్లో అందరు ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి రోగాలు, వ్యాధులు రావద్దని, పంటలు బాగాపండాలని,  గ్రామమంతా సుఖ సంతోషలతో ఉండాలని ఈ బొమ్మల పెళ్లి నిర్వహిస్తుంటారు. ఎలాంటి గొడవలు లేకుండా అందరం కలసిమెలసి ఉండాలనే సంకల్పంతో.. ఈ సారి ఆ గ్రామంలోని పిల్లలందరూ బొమ్మల పెళ్లిని చేసేందుకు సిద్ధమయ్యారు. అందరూ తలో ఇంత చందాలు వేసుకుని ఈ బొమ్మల పెళ్ళి ఘనంగా చేశారు. అచ్చం నిజమైన పెళ్లి చేసినట్లుగానే బాజా భంజాత్రీలతో, విందు వినోదాలతో ఘనంగా బొమ్మలకు వివాహం జరిపించారు. ఈ బొమ్మల పెళ్ళికి పెద్దలు కూడా తోడవడంతో వివాహ వేడుక అంగరంగవైభవంగా జరిగింది.

ఈ బొమ్మలకు పెళ్లి చేసిన అనంతరం విందు భోజనాలు పెట్టారు.డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తూ సందడిగా గడిపారు. గత ఎనిమిదేళ్ల నుంచి తాటిపల్లి గ్రామంలో ఇలా బొమ్మలకు పెళ్ళి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అలా చేయడం వల్లన గ్రామంలో ఎలాంటి రోగాలు రాలేదని, పంటలు బాగా పండాలని సుఖ సంతోషాలతో ఉన్నామని గ్రామస్థులు తెలిపారు. ఏటా మే నెలలో ఈ బొమ్మల పెళ్ళి చేస్తామని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఊరు బాగు కోసం పిల్లలు బొమ్మల పెళ్ళిలు చేయడం చాల సంతోషంగా ఉందని  గ్రామ పెద్దలు చెబుతున్నారు.

Show comments