Arundhati Movie: అరుంధతి మూవీలో ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు అచ్చం దేవతలా..!

అరుంధతి మూవీలో ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు అచ్చం దేవతలా..!

Arundhati Movie: స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతి. ఇక ఈ సినిమాలో అనుష్క చిన్ననాటి పాత్రలో కనిపించిన పాప అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈమె ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే షాకవుతారు. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Arundhati Movie: స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతి. ఇక ఈ సినిమాలో అనుష్క చిన్ననాటి పాత్రలో కనిపించిన పాప అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈమె ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే షాకవుతారు. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇస్తుంటారు. చాలా సినిమాల్లో నటించి..ప్రేక్షకులను ఆకట్టుంటారు. అలానే మరికొందరు అయితే ఒకటి రెండు సినిమాల్లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినా.. మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ఎంతలా అంటే.. వారు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయినా ఏళ్ల పాటు వారు క్యారెక్టర్ గుర్తుండిపోతారు. అలా ఇండస్ట్రీ నుంచి దూరమైన చాలా మంది చైల్డ్ ఆర్టిస్టల ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. తాజాగా అరుంధతి సినిమాలో అనుష్క చిన్నతనంలోని క్యారెక్ట్ చేసిన పాప ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆ పాప ఉంది.

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన బ్లాక్ బస్టర్  చిత్రం అరుంధతి. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువనే చెప్పాలి.  ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. 2009లో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమానే అనుష్క కెరీర్ కు  మలుపు తిప్పిందనే విషయం ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో నటించిన చాలా మందికి మంచి క్రేజ్ సంపాదించారు. అందులో సోనూ సూద్, షాయాజీ షిండే  వంటి వారు ఉన్నారు.  ఇక ఈ సినిమాలో పశుపతి పాత్రలో సోనూ సూద్ నటన సినిమాకే హైలెట్ గా నిలించిది.

ఇది ఇలా ఉంటే..అరుంధతి సినిమాలో అనుష్క చిన్ననాటి పాత్రలో కనిపించిన చిన్నారికి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె పేరు, వివరాలు తెలియకపోయినా.. అరుంధతి సినిమాలో ఆ చిన్నారి ఇప్పటికి గుర్తుండే ఉంటుంది. ఆ చిన్నారి ఈమె ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే షాక్ అవ్వకమానరు. అరుధంతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆమె పేరు ‘దివ్య నగేష్’. ఈమె తెలుగు, తమిళం భాషలలోని పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి..ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహారాష్ట్రకు చెందిన ఈ అమ్మాయి పైచదువులు కోసం ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత తమిళ్ లో తెదినన్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు కానీ ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

అలా ఎన్ని సినిమాల్లో నటించిన కూడా అరుంధతి సినిమాతోనే దివ్య బాగా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత దివ్య పలు సినిమాలు, కమర్షియల్ యాడ్స్ నటించింది. కొన్నాళ్లుగా ఈమె ఇండస్ట్రీలో ఎక్కడ కనిపించడం లేదు. కానీ, తాజాగా దివ్య నగేష్ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇయ చిన్నారి జేజమ్మగా అలరించిన దివ్య.. ఇప్పుడు దేవతలా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాకుండా.. త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఈ అమ్మడు ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  అరుంధతి ఫేమ్ దివ్య నగేష్ లేటెస్ట్ ఫోటో స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments