Guess The Actress: ఈ చిన్నారిని గుర్తు పట్టారా..? ఒకప్పటి స్టార్ హీరోయిన్..

ఈ చిన్నారిని గుర్తు పట్టారా..? ఒకప్పటి స్టార్ హీరోయిన్..

చెంపకు చారడేసి కళ్లతో.. ఆ కంటి నిండా కాటుకతో.. రెండు జడలు వేసుకుని, ఓ కొప్పు నుండా పూలు పెట్టుకుని, పెద్ద బొట్టుతో తదేకంగా చూస్తున్న ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా.. ఆమె ఒకప్పడు ఇండియన్ సినిమాను రూల్ చేసింది.

చెంపకు చారడేసి కళ్లతో.. ఆ కంటి నిండా కాటుకతో.. రెండు జడలు వేసుకుని, ఓ కొప్పు నుండా పూలు పెట్టుకుని, పెద్ద బొట్టుతో తదేకంగా చూస్తున్న ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా.. ఆమె ఒకప్పడు ఇండియన్ సినిమాను రూల్ చేసింది.

వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన తారమణులంతా.. ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోయారు. భర్త, పిల్లలు, సంసారం లేదంటే బిజినెస్ అంటూ తమ పనులతో బిజీ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎక్కడో వారి ఫోటోలు సోషల్ మీడియాలో సడెన్‌గా చూస్తే.. ఆమె ఈమెనేనా అని అనిపించకమానదు. అలాగే అప్పుడప్పుడు వారు నటించిన సినిమాలకు సంబంధించిన పిక్చర్స్.. లేదంటే చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ.. ప్రేక్షకులను ముఖ్యంగా అభిమానుల్ని ఖుషీ చేస్తున్నారు. థ్రో బ్యాక్ పిక్స్ లేదా.. అప్పుడు.. ఇప్పుడు అనే కాన్సెప్ట్ తో కొన్ని చిన్ననాటి ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. మీరు పైన చూస్తున్న ఈ పిక్ కూడా ఆ కోవకు చెందిందే.

చారడేసి కళ్లతో.. ఆ కళ్ల నిండా కాటుకతో..బారు బొట్టు, కొప్పు నిండా పూలు పెట్టుకుని తదేకంగా చూస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా. బహుశా 2000 కిడ్స్‌కు పెద్దగా పరిచయం లేదు కానీ.. 1970-90 దశకం వరకు తన చిత్రాలతో అలరించింది. బేస్ వాయిస్‌లో హీరోలతో పోటీగా నటించిన హీరోయిన్ ఆమె. తన మాట వెనుక కాఠిన్యం, పొగరు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఒక్క తెలుగులోనే కాదూ.. కన్నడ, మలయాళ, తమిళ, హిందీ ఇండస్ట్రీలో కాలు మోపి.. టాప్ హీరోయిన్ అయ్యింది. ఇంతకు ఆమె ఎవ్వరో కాదూ.. కనక విజయలక్ష్మి అలియాస్ మాధవి. భరత నాట్యంలో దిట్ట అయిన మాధవి రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇస్తుండగా.. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు కళ్లల్లో పడింది.

అలా తూర్పు పడమర సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసిన మాధవి.. అనతి కాలంలోనే టాప్ హీరోలతో నటించింది. కమల్‌తో మరో చరిత్ర, కృష్ణం రాజు, చిరంజీవి, కృష్ణ, శివాజీ గణేశన్, రజనీకాంత్, రాజ్ కుమార్, విష్ణువర్దన్, అమితాబచ్చన్, వినోద్ ఖన్నా, మిథున్ చక్రవర్తి వంటి టాప్ హీరోల పక్కన ఆడిపాడింది. ఇప్పటి తరానికి ఆమె తెలియదు కానీ.. రగులుతోంది మొగలి పొద అనే పాటలో చిరంజీవితో స్టెప్పులు వీసింది ఈ నటినే. చిరంజీవి, మాధవి కాంబోలో సినిమా వస్తుందంటే.. హిట్ అని భావించే వారంతా. ఆమె నటన చాలా గంభీరంగా ఉండేది. ఆమె మాటలు అహంకారిగా తోస్తాయి. కానీ మాతృదేవోభవలో ఆమె నటన ఎవ్వర్ బీఫోర్, నెవ్వర్ ఆఫ్టర్ అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సినిమాను చూస్తే ఏడవని వారుండరు.

సుమారు 20 సంవత్సరాల పాటు సినీ ప్రపంచాన్ని తన నటనతో మంత్ర ముగ్గుల్ని చేసిన ఈ నటి.. చివరి సారిగా తెలుగులో చిరంజీవి మూవీ బిగ్ బాస్‌లో కనిపించింది. 1996లో ఫార్మాసూటికల్ వ్యాపార వేత్త రాల్ఫ్ శర్మను వివాహం చేసుకుంది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఆ తర్వాత ఆమె అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం వీరు న్యూజెర్సీలో ఉంటున్నారు.. భర్త వ్యాపారాల్లో తోడుగా నిలుస్తోంది. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు. వారికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది. ఈ చిన్ననాటి పిక్ కూడా తానే నెటిజన్లతో పంచుకుంది. ఈ పిక్ చూసిన అప్పటి ఫ్యాన్స్.. మిమ్మల్ని మిస్ అవుతున్నామని, తిరిగి రావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఆమెను చూస్తే గుర్తు పట్టలేరు.   ఆమె నటించిన సినిమాల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments