Discount On OnePlus 12R: భారతదేశంలో కూడా వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్‌పై డిస్కౌంట్..

భారతదేశంలో కూడా వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్‌పై డిస్కౌంట్..

Discount On OnePlus 12R: మన దేశంలో వన్ ప్లస్ ఫోన్లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఫ్లాగ్ షిప్ అనుభూతిని కోరుకునేవారి కోసం వన్ ప్లస్ నుంచి వచ్చిన సరికొత్త ఫోన్ మీద డిస్కౌంట్ లభిస్తుంది.

Discount On OnePlus 12R: మన దేశంలో వన్ ప్లస్ ఫోన్లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఫ్లాగ్ షిప్ అనుభూతిని కోరుకునేవారి కోసం వన్ ప్లస్ నుంచి వచ్చిన సరికొత్త ఫోన్ మీద డిస్కౌంట్ లభిస్తుంది.

మన దేశం యువతలో ఉండే ఒక విశేషం ఏంటి అంటే మనం వాడే ఫోన్ బాగున్నప్పటికీ ఫోన్ మారిస్తే బాగుండు, చాలా నెలల నుండి వాడుతున్నాం కదా కొత్త ఫోన్ తీసుకుందాం అని ఇలా గాడ్జెట్ పిచ్చోళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. అందుకే ఏ ఫోన్ కంపెనీ అయినా ముందు ఇండియన్ మార్కెట్ వైపు వారి దృష్టి పెడతారు. భారీ డిస్కౌంట్స్ ని తీసుకుని వచ్చి భారత యువతని ఆకర్షిస్తారు. అదే రీతిలో ఇప్పుడు  వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ ని మంచి డిస్కౌంట్ లో అందిస్తున్నారు. 

ఈ ఫోన్ ను వన్‌ప్లస్ నుంచి మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్ లలో ఒకటిగా చెప్పవచ్చు. నాలుగు నెలల క్రితం కొన్ని ఆఫర్స్ ఈ ఫోన్ పై పెట్టారు. కానీ సేల్స్ అమాంతం పెరగడంతో మళ్ళీ ఆ ఆఫర్స్ ని తీసేశారు. ఆఫర్ వల్ల సేల్స్ పెరిగాయి అని గ్రహించి నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెజాన్‌లో ఇంకో ఆఫర్ ధరకు అందుబాటులోకి తెచ్చారు. అయితే, వన్‌ప్లస్ 12ఆర్‌పై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు బ్యాంక్ నుండి కూడా ఆఫర్ అందిస్తున్న్నారు. అమెజాన్‌లో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడండి.

అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ ధర రూ. 37,999కే అందుబాటులో ఉంది. నిజానికి దీని ఒరిజినల్ ప్రైస్ రూ. 39,999. మీరు వెబ్సైటు లో ఈ ఫోన్‌పై రూ. 2 వేల డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, (BOBCARD)పై అదనంగా మరో రూ. 2వేలు కూడా తగ్గింపు ఆఫర్ ఉంది. ఇలా బ్యాంకు ఆఫర్‌లతో కూడా కలుపుకుని ధరను రూ.35,999కి తగ్గించి ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ బెస్ట్ సేల్స్ అయిన స్మార్ట్‌ఫోన్,  మంచి ప్రైస్ లో ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్లు ఈ వన్‌ప్లస్ ఫో‌న్‌ను కొనుగోలు చేయొచ్చు. ఈ వన్‌ప్లస్ ఫోన్ 6.78-అంగుళాల డిస్ప్లే తో వస్తుంది. 120Hz అమోల్డ్ ప్యానెల్‌ తో ఉంది. 4వ జనరేషన్ ఎల్‌టీపీఓ టెక్నాలజీ సపోర్టుతో వస్తుంది.

ఈ ఫోన్ ఆటోమాటిక్‌గా 1Hz నుంచి 120Hz మధ్య స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అడ్జస్ట్ చేసుకునే గుణం కలిగి చేస్తుంది. మనం పెద్దగా వాడము అను అనుకునే యాప్‌లు డివైజ్‌‌లో ఓపెన్ చేసి రిఫ్రెష్ రేట్‌ను 1Hz లేదా 10Hzకి తగ్గించడం ద్వారా బ్యాటరీ లైఫ్ ను సేవ్ చేయవచ్చు. వన్‌ప్లస్ 4,500నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. ఇది దాని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బ్రైట్నెస్. సన్ లైట్ లో కూడా డిస్‌ప్లే సరిగ్గా కనిపిస్తుంది.

ఆక్వా టచ్ టెక్నాలజీకి సపోర్టుతో గ్రేట్ డిస్‌ప్లే ఎక్స్పీరియన్స్ను పొందవచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ తో చాలా పవర్‌ఫుల్ గా ఉంటుంది ఈ ఫోన్ అలాగే మంచి గేమింగ్ పెర్ఫార్మెన్స్ ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ 5,500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.

గత కొంత కాలంగా సో కాల్డ్ పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి ఫోన్ బాక్స్ లో చార్జర్ ని ఇవ్వడం లేదు, కాని వన్‌ప్లస్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు, బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్, ఐపీ64 రేటింగ్ కలిగి ఉంది. పైగా ఇన్ని ఫీచర్స్ రూ. 40వేల లోపు ఫోన్‌ లో ఉండద రేర్ అనే చెప్పాలి. కొనుగోలు చేసే యూజర్లకు ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. మెటల్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్రీమియం క్వాలిటీని కూడా అందిస్తుంది. త్వరపడండి మళ్ళీ ఆఫర్ ని త్వరలోనే ఆపేయచ్చు.

Show comments