IPL Star Keeper: ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఈమె భర్తకి ఇప్పుడు దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఈమె భర్తకి ఇప్పుడు దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు

IPL Star Keeper: ఐపీఎల్ లో దినేశ్ కార్తీక్ ఆర్సీబీ తరుపున కీపర్ గా తన సత్తా చాటుతున్నారు. దినేష్ సతీమణి ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

IPL Star Keeper: ఐపీఎల్ లో దినేశ్ కార్తీక్ ఆర్సీబీ తరుపున కీపర్ గా తన సత్తా చాటుతున్నారు. దినేష్ సతీమణి ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇటీవల సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సెలబ్రెటీలు తమ అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు.. వారికి సంబంధించిన రేర్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇటాంటి ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. భారతీయ ప్రొఫెషనల్ స్క్వాష్ క్రీడాకారిణి.. పీఎస్ఎ ఉమెన్స్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లోకి ప్రవేశించిన మొదటి భారతీయురాలు, 3 మహిళాల అంతర్జాతీయ స్క్వాష్ ప్లేయర్స్ అసోసియేషన్ టూర్ టైటిళ్లు గెల్చుకున్న క్రీడాకారిణి, ప్రముఖ స్టార్ క్రికెటర్ సతీమణి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అంతర్జాతీయ స్క్వాష్ ప్లేయర్స్ దీపికా పల్లికల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. పీఎస్ఎ ఉమెన్స్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లోకి ప్రవేశించిన తొలి భారతీయురాలిగా సత్తా చాటింది దీపికా పల్లికల్ 21 సెప్టెంబర్ 1991 లో తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటల్లో యాక్టీవ్ గా పాల్గొంటూ వచ్చింది. దీపికా తల్లిదండ్రులు క్రీడారంగానికి చెందినవారు కావడంతో ఆమె ప్రొఫెషనల్ స్క్వాష్ క్రీడాకారిణిగా మంచి పేరు సంపాదించింది. దీపికా పల్లికల్ స్టార్ క్రికెట్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ ని వివాహం చేసుకుంది. దినేశ్ కార్తీక్ దేశం తరుపున ఎన్నో ఉత్తమ ఇన్నింగ్స్ ఆడారు. దినేశ్ కార్తీక్ క్రికెటర్ గా ఎన్నో విజయాలు సాధించినా.. ఆయన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రిటైర్ మెంట్ తర్వాత దినేశ్ పర్సనల్ లైఫ్ లో ఎత్తుపల్లాలు మొదలయ్యాయి. అదే సమయంలో ఆయన మళ్లీ క్రికెట్ లోకి వచ్చి రాణించడంలో ఒక మహిళ స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరో కాదు.. దినేష్ కార్తీక్ సతీమణి దీపిక పల్లికల్.

2015లో దినేష్ – దీపికా వివాహం జరిగింది..ఈ జంటకు ఇద్దరు కుమారులు (కవలలు) సంతానం. వాస్తవానికి దీపికా.. దినేష్ రెండవ భార్య. నిఖిత అనే మహిళతో దినేష్ కి మొదట పెళ్లైంది.. అనివార్య కారణాల వల్ల 2012 లో వీరిద్దరూ విడిపోయారు. అదే సంవత్సరంలో ఆమె మరో క్రికెటర్ మురళి విజయ్ ని పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో దినేష్ కార్తీ తీవ్ర డిప్రేష్ లో ఉండిపోయారు.. అలాంటి సమయంలో అతడి జీవితంలోకి  దీపికా పల్లికల్ ఎంట్రీ ఇచ్చి లైఫ్ స్టైల్ మొత్తం మార్చింది. ప్రస్తుతం దినేష్ కార్తీక్ ఆర్సీబీ నుంచి కీపర్ గా ఆడుతున్నారు. దినేష్ కి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. భారతీయ క్రికెట్లో ఈ జంట ఎంతో ఆకర్షనీయంగా ఉంటారు. ఈ జంట ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో దీపికా పల్లికల్ చిన్ననాటి ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసి ఎంతో క్యూట్ గా ఉందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments