Did You Recognize: ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని గుర్తుపట్టారా? ఇప్పుడో స్టార్ హీరో!

ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని గుర్తుపట్టారా? ఇప్పుడో స్టార్ హీరో!

Did You Recognize: ఈ ఫోటోలో ఫుల్ హ్యాండ్స్ షర్ట్, ప్యాంట్ వేసుకుని నీట్ గా టక్ చేసుకుని ఒక అమ్మాయి పక్కన నిలబడిన ఈ అబ్బాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు ఇతనొక స్టార్ హీరో. ఒకప్పటి స్టార్ హీరో మేనల్లుడు, స్టార్ హీరోకి బావమరిది. ఎవరో గుర్తుపట్టారా?

Did You Recognize: ఈ ఫోటోలో ఫుల్ హ్యాండ్స్ షర్ట్, ప్యాంట్ వేసుకుని నీట్ గా టక్ చేసుకుని ఒక అమ్మాయి పక్కన నిలబడిన ఈ అబ్బాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు ఇతనొక స్టార్ హీరో. ఒకప్పటి స్టార్ హీరో మేనల్లుడు, స్టార్ హీరోకి బావమరిది. ఎవరో గుర్తుపట్టారా?

సెలబ్రిటీలకు సంబంధించి చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి. ఫ్యాన్స్ తమ అభిమాన హీరో చిన్ననాటి ఫోటోలను, త్రోబ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ మురిసిపోతుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ హీరో చిన్నప్పటి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. మరి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని గుర్తుపట్టారా? అతను ఇప్పుడొక స్టార్ హీరో. ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. ఇతని బావ పెద్ద స్టార్ హీరో. ఒకప్పటి అగ్ర హీరో మేనల్లుడు ఈ హీరో. అయితే కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లో ఫస్ట్ సినిమానే హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. సమంతకు అన్నయ్యగా నటించారు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

రెజీనాతో తమిళ రీమేక్ మూవీలో నటించారు. మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ మూవీలో నటించారు. ఆ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో ఈ టైప్ జోనర్ ని టచ్ చేసిన ఫస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అతని బావ సినిమాలోని ఓ డైలాగ్ నే మూవీ టైటిల్ గా ఒక సినిమా చేశారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత మేనమామ మూవీ టైటిల్ తో ఒక సినిమా చేశారు. కానీ ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. మేనమామతో కలిసి ఓ సినిమాలో కూడా నటించారు. హిందీలో టైగర్ ష్రాఫ్, శ్రద్దాకపూర్ నటించిన సినిమాలో కూడా నటించారు. ఆ తర్వాత విభిన్న కథలతో అలరించడం మొదలుపెట్టారు.

మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. నేచురల్ స్టార్ నాని, నారా రోహిత్, సందీప్ కిషన్, శ్రీవిష్ణు వంటి హీరోలతో కలిసి నటించారు. ఇప్పటికైనా ఈ హీరోని గుర్తుపట్టారా? సినిమాల్లోకి రాకముందు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల బ్యాడ్మింటన్ ప్లేయర్స్ లో నంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నారు. డబుల్స్ లో పుల్లెల గోపీచంద్ తో కలిసి ఆడారు. ఈయన మరెవరో కాదు.. సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు. ఈయన నటించిన హరోం హర సినిమా ఇవాళ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. ఆ తర్వాత విభిన్నమైన కథలతో అలరించారు. హరోం హర సినిమాతో నవ దళపతి అనే బిరుదు యాడ్ అయ్యింది. ఈ వార్తతో ప్రస్తుతం సుధీర్ బాబు ట్రెండింగ్ లో ఉన్నారు.

Show comments