Diamond Hunting: రైతుని వరించిన అదృష్టం.. పొలంలో దొరికిన వజ్రం.. ధర ఎంతంటే?

రైతుని వరించిన అదృష్టం.. పొలంలో దొరికిన వజ్రం.. ధర ఎంతంటే?

Diamond Hunting: పొలాల్లో పంటతో పాటు వజ్రాలు కూడా పండుతున్నాయని కొంతమంది రైతులు నిరూపిస్తున్నారు. తొలకరి చినుకులు నేలని ముద్దాడిన తర్వాత స్థానికంగా ఉండే రైతులు అందరూ పొలాల్లో వజ్రాల కోసం వేట కొనసాగించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నది. ఎంతోమంది రైతులు, స్థానికులు వజ్రాలను దక్కించుకున్నారు. తాజాగా ఓ రైతుని వజ్రం వరించింది.

Diamond Hunting: పొలాల్లో పంటతో పాటు వజ్రాలు కూడా పండుతున్నాయని కొంతమంది రైతులు నిరూపిస్తున్నారు. తొలకరి చినుకులు నేలని ముద్దాడిన తర్వాత స్థానికంగా ఉండే రైతులు అందరూ పొలాల్లో వజ్రాల కోసం వేట కొనసాగించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నది. ఎంతోమంది రైతులు, స్థానికులు వజ్రాలను దక్కించుకున్నారు. తాజాగా ఓ రైతుని వజ్రం వరించింది.

అదృష్టం బాగుంటే రైతుల పొలంలో పంటలే కాదు.. అప్పుడప్పుడూ వజ్రాలు కూడా పండుతాయి. దానికి చాలా మంది రైతులే ఉదాహరణ. పొలాల్లో వజ్రాల కోసం వెతికే రైతులకు వజ్రాల రూపంలో అదృష్టం వరిస్తుంది. ప్రతి ఏటా తొలకరి వర్షాలు మొదలైనప్పుడు ఈ వజ్రాల వేట అనేది కొనసాగుతుంది. తాజాగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం వారం రోజులుగా జనాలు వేటను కొనసాగిస్తున్నారు. అయితే ఎవరికీ దక్కని అదృష్టం ఒక రైతును వరించింది. ఆ రైతుకు ఒక వజ్రం దొరికింది. దీంతో అతని దశ తిరిగిపోయింది. కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంప గ్రామానికి చెందిన ఓకే రైతు పొలం పనులు చేసుకుంటుండగా ఒక వజ్రం దొరికింది.

దాన్ని పెరవలికి చెందిన వ్యాపారి వేలంలో 5 లక్షలు క్యాష్ కి, రెండు గ్రాముల బంగారానికి దక్కించుకున్నాడు. ఆ డబ్బుని, బంగారాన్ని రైతుకి ఇచ్చి రైతు వద్ద ఉన్న వజ్రాన్ని తీసుకెళ్లాడా వ్యాపారి. అయితే బయట మార్కెట్ లో ఆ వజ్రం విలువ ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మద్దికెర, పెరవలి, తుగ్గలి, జి. ఎర్రగుడి, రామాపురం, పగిడిరాయి, చిన్నజొన్నగిరి, ఉప్పరపల్లి, గిరిగెట్ల గ్రామల్లో స్థానిక ప్రజలు వజ్రాల కోసం గాలింపులు మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో కూడా వజ్రాల వేట మొదలుపెట్టారు. అనంతపురం జిల్లాలో తొలకరి వానలు కురవగానే అక్కడ జనాలు వజ్రాల కోసం వేటను మొదలుపెడతారు. కానీ ఈసారి వర్షాలు ఎర్లీగా స్టార్ట్ అవ్వడంతో వేసవి కాలంలోనే వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు.

వజ్రకరూర్, ఊటకల్లు, బేతాపల్లి ప్రాంతాల్లో కూడా వజ్రాల కోసం వెతుకుతున్నారు. వానలు పడిన తర్వాత జనాలు పొలాల బాట పడతారు. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరికి వజ్రాలు దొరుకుతుంటాయి. దీంతో పిల్లలు, పెద్దలు అందరూ వజ్రాల కోసం వెతుకుతుంటారు. దొరికిన వజ్రాలను రహస్యంగా వ్యాపారులకు అమ్మేస్తుంటారు. వ్యాపారులు కూడా స్థానికంగా మకాం వేసి తక్కువ రేటుకి రైతు దగ్గర నుంచి వజ్రాన్ని దక్కించుకోవాలని చూస్తారు. వ్యాపారులు ఎక్కువ మంది ఉంటే వేలంపాట నిర్వహిస్తారు. ఏ వ్యాపారి ఎక్కువ డబ్బులు ఇస్తే అతనికి వజ్రాన్ని అమ్ముతుంటారు. వజ్రం రంగు, దాని జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్క గట్టి ఎంత విలువ చేస్తుందో చెప్పి డబ్బు, దానితో పాటు బంగారం ఇస్తారు.

గత ఏడాది చిన్నజొన్నగిరికి చెందిన ఓ రైతుకు తన పొలంలో విలువైన వజ్రం దొరకగా.. దాన్ని మంచి రేటుకి అమ్ముకుని లాభపడ్డారు. ఈసారి వానలు వేసవిలోనే కురవడంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పొలాల్లో వజ్రాల వేట మొదలైంది. విచిత్రం ఏంటంటే.. ఈ వజ్రాల వేట కోసం చుట్టుపక్కల ఊర్ల నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్తున్నారట. కొంతమంది అయితే ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ అక్కడ మకాం పెట్టినట్లు సమాచారం. పొలాల్లోనే వంట, తంట అన్నీ సెట్ చేసుకుని మరీ వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారట. మొత్తానికి పంటలు పండాల్సిన పొలాలు.. వజ్రాలని పండిస్తున్నాయన్నమాట.

Show comments