ఈ నెల 30న విడుదల కాబోతున్న పొన్నియన్ సెల్వన్ 1 మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి, కాకపోతే కథలో బ్యాక్ డ్రాప్ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది కాకపోవడంతో ఇక్కడ ప్రమోషన్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. రాజమౌళి తరహాలో మణిరత్నం అన్ని బాషల ఆర్టిస్టులను ఇందులో మిక్స్ చేయలేదు. విక్రమ్, కార్తీ, జయం రవి, పార్తిబన్ ఇలా అందరూ అరవ బ్యాచే ఉన్నారు. ఒక్క ఐశ్వర్యరాయ్ మాత్రమే బయట నుంచి తీసుకొచ్చారు. శోభిత ధూళిపాళ తెలుగమ్మాయే కానీ క్యాస్టింగ్ పరంగా తను పెద్ద అడ్వాంటేజ్ ఏమీ కాదు. సో పబ్లిసిటీ చాలా కీలకం.
సరే ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ వస్తున్నప్పుడు సహజంగా పోటీ పడేందుకు ఎవరూ సాహసించరు. కానీ ఇద్దరు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. మొదటిది బాలీవుడ్ సినిమా విక్రమ్ వేదా. హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ లో ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన పుష్కర్ గాయత్రిల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందించారు. ట్రైలర్ వచ్చాక హైప్ పెరిగింది. నార్త్ లో దీనికి భారీ ఓపెనింగ్స్ వచ్చా అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదే జరిగితే అది పొన్నియన్ సెల్వన్ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. గతంలో సైరా నరసింహారెడ్డి వచ్చిన రోజే వార్ ని దింపితే దెబ్బకు మెగాస్టార్ అంతటి వాడికి సైతం అక్కడ ఫెయిల్యూర్ తప్పలేదు.
ఇప్పడది రిపీట్ కాకూడదనేదే ఫ్యాన్స్ అభిమతం. రెండో వ్యక్తి ధనుష్, సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో రూపొందిన నానే వరువేన్ సైతం 30న వస్తుందట. ఈ కాంబోకున్న క్రేజ్ దృష్ట్యా అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. పైగా తమిళంలో తిరు బ్లాక్ బస్టర్ సక్సెస్ తో రజనీకాంత్ అల్లుడు మంచి జోష్ మీదున్నాడు. కాబట్టి పీఎస్ 1కు థ్రెట్ గానే ఉంటుంది. ఇక్కడితో ఆగిపోలేదు. వారం గడవడం ఆలస్యం చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ ఒకే రోజు అక్టోబర్ 5న బరిలో దిగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వీటికి దక్కే రిలీజ్ కు పీఎస్ 1 స్క్రీన్లు తగ్గిపోతాయి. వీటితో పాటు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం కూడా ఉంటుంది. మొత్తానికి పొన్నియన్ సెల్వన్ 1 చుట్టూ పెద్ద పద్మవ్యూహమే ఉంటోంది
నలుగురు హీరోలకు రెడ్ కార్డ్.. అదేంటి హీరోలకు రెడ్ కార్డ్ ఇవ్వడమేంటి? వాళ్లేమైనా గేమ్స్ ఆడారా? అని మీకు అనుమానం రావొచ్చు. కానీ ఈ నలుగురు హీరోలు ఏ ఆటా ఆడలేదు. మరెందుకు వారికి రెడ్ కార్డ్ ఇచ్చారు? ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఇక్కడికే వస్తున్నా. కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన శింబు, ధనుష్, విశాల్, అధర్వలకు కోలీవుడ్ నిర్మాతల మండలి రెడ్ కార్డులను జారీ చేసింది. బుధవారం(సెప్టెంబర్ 13)న చెన్నైలో జరిగిన నిర్మాతల సమావేశంలో […]