కొత్త సినిమాల విడుదల తేదీలను కన్ఫర్మ్ చేసుకునే విషయంలో నిర్మాతలు చాలా అడ్వాన్స్ గా ఉండక తప్పని పరిస్థితి తలెత్తింది. కనీసం రెండు మూడు నెలల ముందే లాక్ చేసుకుంటే తప్ప క్లాష్ విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. పోటీ లేకుండా సోలోగా రావడం కష్టమే కానీ ఉన్నంతలో పర్ఫెక్ట్ డేట్ ని సెట్ చేసుకోవడం చాలా కీలకం. తాజాగా ధనుష్ హీరోగా రూపొందుతున్న ‘సర్’ రిలీజ్ ని డిసెంబర్ 2కి లాక్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సర్ ని సితార బ్యానర్ నిర్మించింది. సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా ఎడ్యుకేషన్ మాఫియా మీద పోరాడే పాత్రలో ధనుష్ మొదటిసారి స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు.
మిస్టర్ మజ్ను, రంగ్ దే వరస వైఫల్యాల తర్వాత వెంకీ అట్లూరి ప్రేమకథలను వదిలేసి ఈసారి సీరియస్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు. ఆ మధ్య వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. అదే రోజు వస్తున్నట్టు గతంలో అడవి శేష్ ‘హిట్ 2 ది సెకండ్ కేస్’ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన సంగతి గుర్తే. విశ్వక్ సేన్ నటించిన మొదటి భాగంతో సంబంధం లేకుండా దర్శకుడు శైలేష్ కొలను కొత్త బ్యాక్ డ్రాప్ తో రూపొందిస్తున్నాడు. మేజర్ ప్యాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అయ్యాక ఇప్పుడీ హిట్ 2ని కూడా మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా కొన్ని కీలక మార్పులు చేర్పులు చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీనికి నాని నిర్మాత.
నిజానికి డిసెంబర్ 2కి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో సినిమా వస్తుందని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అఖండ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని వాళ్ళ నమ్మకం. అయితే ఆ టైంకంతా డెడ్ లైన్ మీట్ కావడం కష్టమేనని వినికిడి. దాని బదులు 2023 సంక్రాంతికి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు జరుగుతున్నాయని తెలిసింది. ఒకవేళ ప్రభాస్ ఆది పురుష్, చిరంజీవి వాల్తేర్ వీరయ్య, విజయ్ వారసుడులు కూడా బరిలో ఉంటే అప్పుడేం చేయాలో ఆలోచిస్తారు. ఈ ప్రకారం చూస్తే డిసెంబరే బెటర్ గా కనిపిస్తోంది. మొత్తానికి కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ హీరోల ఫేస్ టు ఫేస్ క్లాష్ కి డిసెంబర్ 2 రెడీ అవుతోంది. చూద్దాం.
నలుగురు హీరోలకు రెడ్ కార్డ్.. అదేంటి హీరోలకు రెడ్ కార్డ్ ఇవ్వడమేంటి? వాళ్లేమైనా గేమ్స్ ఆడారా? అని మీకు అనుమానం రావొచ్చు. కానీ ఈ నలుగురు హీరోలు ఏ ఆటా ఆడలేదు. మరెందుకు వారికి రెడ్ కార్డ్ ఇచ్చారు? ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఇక్కడికే వస్తున్నా. కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన శింబు, ధనుష్, విశాల్, అధర్వలకు కోలీవుడ్ నిర్మాతల మండలి రెడ్ కార్డులను జారీ చేసింది. బుధవారం(సెప్టెంబర్ 13)న చెన్నైలో జరిగిన నిర్మాతల సమావేశంలో […]