Jr Artist Leaked Devara Story: దేవర స్టోరీ ఏంటో చెప్పేసిన జూనియర్ ఆర్టిస్ట్.. అక్కడో కాపరి ఉంటాడు అంటూ..

దేవర స్టోరీ ఏంటో చెప్పేసిన జూనియర్ ఆర్టిస్ట్.. అక్కడో కాపరి ఉంటాడు అంటూ..

Jr Artist Leaked Devara Story: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, క్లీన్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న దేవర సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల అనిరుద్ వదిలిన దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముందు నువ్వెంత’ అనే ఫియర్ సాంగ్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా కథ బీభత్సంగా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో దేవర స్టోరీ ఇదే అంటూ ఒక జూనియర్ ఆర్టిస్ట్ స్టోరీ లీక్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Jr Artist Leaked Devara Story: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, క్లీన్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న దేవర సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల అనిరుద్ వదిలిన దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముందు నువ్వెంత’ అనే ఫియర్ సాంగ్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా కథ బీభత్సంగా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో దేవర స్టోరీ ఇదే అంటూ ఒక జూనియర్ ఆర్టిస్ట్ స్టోరీ లీక్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

‘దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముందు నువ్వెంత’ ఈ ఒక్క లిరిక్ తో సినిమా మీద హైప్ మరింత పెంచేసింది. అసలే ఎన్టీఆర్.. ఆపై ఊర మాస్ లుక్. ఆ మాస్ కటౌట్ ని వర్ణించేలా ఆ లిరిక్స్.. ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా అనిపిస్తుంది. దీనికే ఇలా అనిపిస్తే ఇక సినిమా రిలీజ్ అయితే ధమ్ బిర్యానీనేమో ఇక. అసలు స్టోరీ ఎలా ఉంటుంది అనే దానిపైనే ఇప్పుడు చర్చంతా. తాజాగా దేవరకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అదే సినిమా స్టోరీ. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటో చెప్పేశారు ఒక ఆర్టిస్ట్. దేవర సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న వ్యక్తి ఆ మూవీ స్టోరీ ఏంటో చెప్పేశారు. తాజాగా దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

అది ఆర్ఆర్ఆర్ సినిమాతో దగ్గరి పోలిక కలిగి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ ని మించిన క్యారెక్టర్ లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లో రాజీవ్ కనకాల ఒక మాట అంటారు. అక్కడ ఒక కాపరి ఉంటాడు అని. అంటే ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక గ్రామానికి ఎన్టీఆర్ కాపరిగా ఉంటేనే.. మల్లి అనే అమ్మాయిని కాపాడేందుకు విధ్వంసం సృష్టించారు. అలాంటిది పది గ్రామాలకు కాపరి అంటే విస్ఫోటనం, విధ్వంసం ఎన్నుంటే అన్నీ కలిపి వచ్చేసినట్టే ఉంటుంది. అసలే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ ఇస్తే నమిలి మింగేస్తారు ఎన్టీఆర్. అలాంటిది ఇంత పెద్ద క్యారెక్టర్ ఇస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

దేవర సినిమాలో ఎన్టీఆర్ 10 ఊర్లకు కాపరి లాగా ఉంటాడని.. వాళ్లకు ఏదైనా అయితే వాళ్ళ కోసం అడ్డంగా నిలబడిపోతాడని’ జూనియర్ ఆర్టిస్ట్ వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇదే దేవర కథ అయితే కనుక కొరటాల టేకింగ్ కి, ఎన్టీఆర్ ఎలివేషన్స్, యాక్షన్ కి పూనకాలు రావడం ఖాయం అని అంటున్నారు. కాగా ఈ సినిమాని నందమూరి ఆర్ట్స్, యువసుధ క్రియేషన్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా వస్తుంది. మొదటి పార్ట్ ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇక మాస్ జాతరే మిగిలుంది.

Show comments