తెలంగాణ DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్.. విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణ DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్.. విద్యాశాఖ కీలక నిర్ణయం

డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ 2024 విడుదల చేసిన విషయం తెలిసిందే.

డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ 2024 విడుదల చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై దృష్టిపెట్టిన రేవంత్ సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. గ్రూప్ 1,2,3, మెగా డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగా వీటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ 2024 విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ మెగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తాజాగా విద్యాశాఖ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది.

డీఎస్సీ ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ ఖాళీలు 6,508 భర్తీ చేయనున్నారు. పీఈటీ 182, లాంగ్వేజ్ పండిట్ 727, స్కూల్ అసిస్టెంట్ 2,629, స్కూల్ అసిస్టెంట్( స్పెషల్ ఎడ్యుకేషన్) 220, ఎస్జీటీ( స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. డీఎస్సీ పరీక్షలు జూలైలో జరుగనున్నాయి. ఈ క్రమంలో ఇటీవల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 12న విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో డీఎస్సీ అభ్యర్థులకు టెట్ స్కోర్‌తో పాటు ఇత‌ర వివ‌రాల‌ను ఎడిట్ చేసుకునేందుకు విద్యాశాఖ అవ‌కాశం క‌ల్పించింది. అప్లై చేసుకునే సమయంలో ఏవైనా తప్పులు ఉన్నట్లైతే ఎడిట్ చేసుకోవచ్చు అని తెలిపింది.

మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన టెట్ పరీక్షకు పేపర్‌1కు 85,996 మంది, పేపర్‌2 పరీక్షకు 1,50,491 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నిన్న విడుదలైన టెట్‌ ఫలితాల్లో పేపర్‌ -1లో 57,725 (67.13%), పేపర్‌ -2లో 51,443 (34.18%) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్‌ -1లో ఏకంగా 30.24శాతం, పేపర్‌ -2లో 18.88శాతం ఉత్తీర్ణతశాతం పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, అర్హత సాధించని అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. టెట్‌ -24లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు డిసెంబర్‌ టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. టెట్‌-24లో అర్హత సాధించిన వారికి ఒకసారి డీఎస్సీ పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. ఇక టెట్ ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుందనే విషయం తెలిసిందే.

Show comments