కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో.. అల్లుడి ఇంటికి వెళ్లి

కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో.. అల్లుడి ఇంటికి వెళ్లి

కూతురి కోసం ఏ పనైనా చేసే తండ్రి.. పెళ్లి విషయంలో మాత్రం.. తాను చూసిన సంబంధమే చేసుకోవాలన్న పంతంతో ఉంటారు. కూతురు ఎవరినైనా ప్రేమించానని చెబితే.. అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. అలాంటిది చెప్పాపెట్టకుండా..

కూతురి కోసం ఏ పనైనా చేసే తండ్రి.. పెళ్లి విషయంలో మాత్రం.. తాను చూసిన సంబంధమే చేసుకోవాలన్న పంతంతో ఉంటారు. కూతురు ఎవరినైనా ప్రేమించానని చెబితే.. అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. అలాంటిది చెప్పాపెట్టకుండా..

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అడగాలే కానీ కొండ మీది కోతినైనా తీసుకు వస్తాడు తండ్రి. కానీ తాను ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లాడతాను అంటే ససేమీరా అంటాడు. అది కూతురిపై ఆయనకు ఉన్న ప్రేమ. తన బంగారు పాప గురించి అన్ని తనకే తెలుసునని.. తాను తప్ప ఇంకెవ్వరూ ఆమెను ఎక్కువగా ప్రేమించలేరన్న నమ్మకం తండ్రిది. తాను చూసిందే మంచి సంబంధం అని, లవ్ మత్తులో అనామకుడి చేతిలో పడి.. తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందన్న నాన్న భయం, ఆందోళన.. కూతురి ప్రేమకు అవరోధంగా మారుతుంది. 20 ఏళ్ల కన్న తండ్రి ప్రేమను కాదని, మూడు నాలుగేళ్ల పరిచయస్తుడిని పెళ్లి చేసుకుంటే సహించలేరు.. భరించలేరు. కూతుర్ని నాయన్నో, భయాన్నో వెనక్కు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

కూతురి కోసం తండ్రి దారుణానికి పాల్పడిన ఘటన ఏలూరు జిల్లాలో కలవర పాటుకు గురి చేసింది. తమను కాదని ప్రేమించిన యువకుడ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో తండ్రి.. అల్లుడిపై కత్తి దూసిన ఘటన చోటుచేసుకుంది. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరి పల్లి మండలం సీతారామపురానినకి చెందిన కందుల వంశీ, అత్తి శ్రావణి కొన్నాళ్ల నుండి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తండ్రి.. కోపంతో బంధువులను వెంట వేసుకుని వంశీ ఇంటిపై దాడి చేశాడు. ఆ సమయంలో వెంట ఆయుధాలు తీసుకెళ్లారు. అల్లుడిపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడ్డాడు వంశీ.

ఈ దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వంశీని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో శ్రావణి తండ్రి, ఇతర బంధువులపై కేసు నమోదు చేశారు. శ్రావణి, వంశీ ప్రేమను పెద్దలు అడ్డుచెప్పడంతో ఈ నెల 8న ఏలూరులో పెళ్లి చేసుకున్నారు. అయితే తన తల్లిదండ్రుల నుండి ప్రాణ హాని భావించిన శ్రావణి.. పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇరు కుటుంబ సభ్యులను పిలిపించిన పోలీసులు.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ శ్రావణి తండ్రి తీరు మారలేదు. చివరికి అల్లుడిపై దాడి చేసి.. కూతుర్ని బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

Show comments