కూతురికి కొత్తగా పెళ్లైంది.. ఈ తల్లిదండ్రులు ఎంత పని చేశారంటే?

కూతురికి కొత్తగా పెళ్లైంది.. ఈ తల్లిదండ్రులు ఎంత పని చేశారంటే?

కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆమె కోరింది కాదనకుండా కొనిపెట్టారు. చదువులు చదివించారు. కానీ ఆమె ఓఅబ్బాయిని ప్రేమించింది. కూతురు లవ్ మ్యాటర్ తండ్రికి తెలిసింది. ససేమీరా అన్నాడు

కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆమె కోరింది కాదనకుండా కొనిపెట్టారు. చదువులు చదివించారు. కానీ ఆమె ఓఅబ్బాయిని ప్రేమించింది. కూతురు లవ్ మ్యాటర్ తండ్రికి తెలిసింది. ససేమీరా అన్నాడు

దేశం శాస్త్ర సాంకేతికంగా ఎంత ముందుకు దూసుకెళ్లినా, కులాలు, మతాలు వెనక్కు లాగుతూ ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయికి పెళ్లి చేసే విషయంలో కుల పట్టింపు ఎక్కువగా ఉంటుంది. కూతురు ఎవరినైనా ప్రేమిస్తే.. ముందుగా అడిగేది అతడు మన కులపోడేనా అని.? కాదని తెలిస్తే కన్నెర్ర చేస్తారు. కూతుర్ని బంధించేస్తారు. హడావుడిగా ఆమెకు ఓ సంబంధం చూసేస్తుంటారు. అయితే మనసిచ్చిన వాడిని మనువాడలేకపోతే.. తన జీవితం వ్యర్థం అని భావిస్తుంటుంది అమ్మాయి. పేరెంట్స్ కాదని ప్రియుడి కోసం వెళ్లి పెళ్లి చేసుకుని తన బతుకు తాను బతుకుతుంది. అయినా సరే పెరెంట్స్ ఆమెను అలా కూడా వదిలిపెట్టరు. ఈ క్రమంలో తమ పరువు కోసం ఆమెను చంపేందుకు వెనకాడడు.. అందుకు ఉదాహరణ అమృత-ప్రణయ్ కేస్.

కూతురు తమను కాదని మరొకర్ని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో ఆమెను తండ్రి కిడ్నాప్ చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని అతి శీతల ప్రాంతం, పర్యాటక ప్రాంతం ఊటీలో ఈ సంఘటన జరిగింది. నీలగిరి జిల్లా కూనూరు పక్కనే ఉన్న అరువంకాడు ప్రాంతానికి చెందిన కవిన్ కుమార్ (24), ఎడపల్లికి చెందిన రోషిణీ (24) అనే యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిది వేర్వేరు కులాలు కావడంతో తొలినుండి వీరిలో భయం ఉండేది. కాగా, వీరి లవ్ మ్యాటర్ తల్లిదండ్రులకు తెలిసి.. రోషిణీని నిర్బంధించారు. అయితే ఏప్రిల్ 25న ఆమె ఇంట్లో నుండి పారిపోయి.. ప్రియుడ్ని కలుసుకుంది. ఇద్దరు కలిసి.. అదే రోజు పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించారు.

అంతలో మరుసటి రోజు కూతురు కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. కూతురు పెళ్లి చేసుకుందన్న విషయం తెలిసింది. ఇద్దరు మేజర్లు కావడంతో .. ఆమెను భర్త వద్దకు పంపించారు. హాయిగా సాగిపోతుంది కొత్త కాపురం. అంతలో ఈ నెల 11వ తేదీ రాత్రి కొంత మంది మహిళలు కవిన్ కుమార్ ఇంటికి వచ్చి తల్లి, సోదరిని దుర్భాషలాడారు. రోషిణీని బలవంతంగా తీసుకెళ్లారు.భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కవి న్‌కుమార్‌ భార్య రోషిణి కోసం గాలిస్తున్నారు. రోషిణి తల్లిదండ్రుల ఇంటికి తాళం వేసి ఉంది. ఇదిలా ఉండగా రోషిణి తండ్రి గోపాలకృష్ణ ఆమెను హొసూరుకు తీసుకెళ్లినట్లు సమాచారం. తదనంతరం, ప్రత్యేక బలగాల పోలీసులు వెంటనే హోసూర్ వెళ్లి అక్కడ ఒక ఇంటి నుండి రోషిణిని రక్షించారు. తదనంతరం, రోషిణిని అపహరించినందుకు ఆమె తల్లి శాంతి, తండ్రి గోపాలకృష్ణన్‌తో సహా 6 మందిని అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో పరారీలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show comments