పెళ్లై 3 నెలలే.. భర్తకు అలాంటి కష్టం రావడంతో.. తట్టుకోలేక

పెళ్లై 3 నెలలే.. భర్తకు అలాంటి కష్టం రావడంతో.. తట్టుకోలేక

పెళ్లై మూడు నెలలే అయ్యింది. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వేలల్లో జీతం. ముచ్చటైన కాపురం అనుకున్నారు కానీ. అంతలో భర్తకు ఓ కష్టం వచ్చింది. దీంతో తట్టుకోలేకపోయింది భార్య.. పుట్టింటికి వెళ్లి..

పెళ్లై మూడు నెలలే అయ్యింది. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వేలల్లో జీతం. ముచ్చటైన కాపురం అనుకున్నారు కానీ. అంతలో భర్తకు ఓ కష్టం వచ్చింది. దీంతో తట్టుకోలేకపోయింది భార్య.. పుట్టింటికి వెళ్లి..

ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో, ఊడిపోతాయో తెలియక టెకీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెద్ద పెద్ద సంస్థలు సైతం తమ కంపెనీ ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కూడా సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్‌ను ఇంటికి సాగనంపుతున్నాయి. రెసిషన్ పీరియడ్ నడుస్తుందని, ప్రాజెక్ట్స్ లేవని, ఇతర కారణాలు చెప్పి తొలగిస్తున్నాయి. ప్రమోషన్ ఇచ్చిన మరుసటి రోజే ఉద్యోగం నుండి తీసేసిన దాఖలాలు ఉన్నాయి. దీంతో టెకీలకు గుండెదడ పట్టుకుంది. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తొలగించింది ఓ కంపెనీ. అయితే భర్తకు జాబ్ పోవడంతో తట్టుకోలేకపోయింది భార్య. దీంతో దారుణ నిర్ణయం తీసుకుంది.

భర్త చేస్తున్న కంపెనీ నుండి అతడ్ని తొలగించారని కలత చెందిన భార్య ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాను కొక్కానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణాలోని సూర్యా పేట జిల్లాలో చోటుచేసకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో చెందిన కొండ ప్రదీప్ అనే వ్యక్తితో పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామానికి చెందిన ఉబెల్లి ఉమ (27) అనే యువతికి మూడు నెలల క్రితమే పెళ్లైంది. ప్రదీప్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. దీంతో ఉమ తల్లిదండ్రులు సైతం కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు.  కొత్త కాపురం హాయిగా సాగిపోతుందనుకున్న సమయంలో ప్రదీప్ ఉద్యోగం పోయింది. కంపెనీ నుండి తొలగించినట్లు భార్యకు చెప్పాడు.

అయితే పెళ్లై మూడు నెలల కావడంతో.. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోవడంతో తీవ్రంగా కలత చెందింది ఉమ. తరచూ బాధపడుతూ ఉండేది. ఇంతలో ఆమె నాలుగు రోజుల క్రితం జాన్ పహాడ్ గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం చెప్పుకుని బాధపడింది. ఆ వేదన ఆమెను మరింత కుంగదీసింది. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లి వచ్చి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించింది. భర్తకు, పోలీసులకు సమాచారం అందించింది. మృతురాలు తల్లి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Show comments