దైవ దర్శనానికి వెళ్లి వచ్చింది.. కొన్ని గంటల్లోనే

దైవ దర్శనానికి వెళ్లి వచ్చింది.. కొన్ని గంటల్లోనే

తన కోపమే తనకు శత్రువు అన్నారు పెద్దలు. నిజమే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనార్థాలకు దారితీస్తూ ఉంటాయి. ఇదిగో ఈ మహిళ విషయంలో అదే జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి వచ్చింది..

తన కోపమే తనకు శత్రువు అన్నారు పెద్దలు. నిజమే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనార్థాలకు దారితీస్తూ ఉంటాయి. ఇదిగో ఈ మహిళ విషయంలో అదే జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి వచ్చింది..

క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు కొంత మంది. తల్లిదండ్రులు తిడతారని పిల్లలు.. మార్కులు సరిగా రాలేదని, అలాగే ప్రేమించిన వ్యక్తులు తమ ప్రేమను తిరస్కరించారని యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు, భర్త తిట్టాడని భార్య, తనపై అలిగి పెళ్లాం పుట్టింటికి వెళ్లిపోయిందన్న కారణంగా పెనిమిటి ఊహించని విధంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలే కాకుండా చిన్న చిన్న వాటికి చిటికెలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ ఆవేశంతో అనార్థానికి దిగింది. పుణ్య క్షేత్రానికి వెళ్లి వచ్చిన ఆ మహిళ.. కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

కుటుంబ సమస్యలతో క్షణికావేశంలో ఇంటికి అనుసంధానంగా ఉన్న పాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. చూసిన కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి త తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అయితే పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అప్పాయపల్లికి చెందిన శ్వేతకు కొన్నాళ్ల క్రితం పెళ్లైంది. తొలుత ఆమె కాపురం సజావుగా సాగిపోయినప్పటికీ.. ఇటీవల సమస్యలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శ్రీశైలం పుణ్య క్షేత్రానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చారు. దైవ దర్శనం బాగా జరిగింది అనుకుంటున్న సమయంలో ఆవేదన మిగిలింది.

ఏమైందో తెలియదు కానీ.. శ్వేత తమ ఇంటికి అనుసంధానంగా ఉన్న పాత ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చూసిన కుటుంబ సభ్యులు హుటా హుటిన నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అయితే కుటుంబ సమస్యల వల్లే ఆమె చనిపోయిందని చర్చించుకుంటున్నారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లిన సమయంలో ఏమన్నా గొడవలు పడ్డారేమో తెలియదని అంటున్నారు. దైవ దర్శనానికి వెళ్లి వచ్చిన కొన్ని గంటల్లోనే వివాహిత ప్రాణాలు కోల్పోయింది. క్షణికావేశంలో శ్వేత మరణం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆత్మహత్య గురించి తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు పోలీసులు.

Show comments