ఇంత అందమైన భార్యపై భర్త దారుణం! ఇంకో ముగ్గరిని తీసుకొచ్చి!

ఇంత అందమైన భార్యపై భర్త దారుణం! ఇంకో ముగ్గరిని తీసుకొచ్చి!

అందమైన భార్య.. ముద్దులొలికే ఇద్దరు పిల్లలు. ఇంకే కావాలి. ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్లింది ఈ ఫ్యామిలీ. తిరిగి ఇంటికి వస్తుండగా.. వారి కారును అడ్డుకున్నారు దుండగులు. ఊహించని విధంగా కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భార్యకు గాయాలయ్యాయి. అంతలో భర్త ఆమెను తీసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టాడు.

అందమైన భార్య.. ముద్దులొలికే ఇద్దరు పిల్లలు. ఇంకే కావాలి. ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్లింది ఈ ఫ్యామిలీ. తిరిగి ఇంటికి వస్తుండగా.. వారి కారును అడ్డుకున్నారు దుండగులు. ఊహించని విధంగా కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భార్యకు గాయాలయ్యాయి. అంతలో భర్త ఆమెను తీసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టాడు.

అతడికి అందమైన భార్య, ముద్దులొలికే పిల్లలు ఉన్నారు. భార్యా భర్తలు, తమ పిల్లలతో కలిసి సరదాగా బయటకు వెళ్లారు. రెస్టారెంట్‌లో భోజనం చేసి కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. అంతలో ఆకస్మాత్తుగా కారును అడ్డుకున్న కొంత మంది ఆగంతకులు ఒక్కసారిగా కాల్పులు జరపడం మొదలు పెట్టారు. ఈ దాడిలో కారులో ఉన్న భార్యకు బుల్లెట్ గాయాయాలయ్యాయి. అర్థరాత్రి చీకటిలో మరొకరిని సాయం అడగలేక.. భర్తే ధైర్యం తెచ్చుకుని.. అంత వేదనలో, టెన్షన్‌లో కారు నడుపుకుంటూ వచ్చి.. భార్యను ఆసుపత్రిలో చేర్చాడు. కానీ ఏం లాభం దురదృష్టవ శాత్తూ భార్య ప్రాణాలు కోల్పోయింది. తనకు అన్ని వేళలా తోడుగా ఉన్న భార్య చనిపోయిందని, ఇక రాదంటూ భోరున ఏడ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా నిందితుల్ని అరెస్టు చేశారు.

అందులో ప్రధాన నిందితుడు ఆమె భర్తే అని తేల్చారు పోలీసులు. అతడితో పాటు మరో ముగ్గురు కిల్లర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్యను మట్టుపెట్టడానికి ఈ ముగ్గురికి సుఫారీ ఇచ్చి..సినిమా రేంజ్‌లో కథ, స్క్రీన్ ప్లే అల్లి నాటకం ఆడాడు భర్త. ఈ ఘటన జార్ఖండ్‌లోని జంషెడ్ పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రవి అగర్వాల్, జ్యోతి భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. రవి వ్యాపారం చేస్తూ ఉంటాడు. గత నెల మార్చి 28న రాత్రి 10 గంటలకు బయటకు వెళ్లారు. రాంచీ-టాటా హైవేలో ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆగంతకులు అడ్డుకుని కాల్పులు జరిపారు. అందులో జ్యోతికి గాయం కాగా, వెంటనే అదే కారులో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఉపయోగం లేదు. చివరకు జ్యోతి చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులకు కూడా కట్టు కథ అల్లాడు భర్త.

కొంత మంది ఆగంతకులు రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని, లేకుంటే తన భార్యను హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చారని, తాను వాటిని ఇవ్వడం లేదంటూ చెప్పుకొచ్చాడు. కారు ఆపి డోర్ వద్దకు వచ్చి నిలబడి కాల్పులు జరిపారంటూ చెప్పాడు. మిగిలిన వివరాలు అడిగితే చెప్పలేకపోయాడు. అయితే జ్యోతి తల్లిదండ్రులు మాత్రం అల్లుడు రవిపై అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఆమెను చంపేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రవిని విచారణ చేపట్టగా.. కుట్ర కోణం బయటకు వచ్చింది. అతడు చెప్పినవన్నీ కట్టుకథలే అని, రవి తన భార్యను ప్రీ ప్లాన్డ్‌గా మర్డర్ చేయించాడని, దాని కోసం రూ. 16 లక్షలు సుఫారీ మాట్లాడుకున్నాడని తేలింది. బయటకు వెళ్లిన విషయాన్ని.. వస్తున్న విషయాన్ని పిన్ టు పిన్ ఆగతంకులకు చెప్పి.. జ్యోతిని హత్య చేయించాడని తెలిసే సరికి పోలీసులే అవాక్కయ్యారు. నలుగుర్ని అరెస్టు చేసి.. దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఆమెను హత్య చేయించడానికి కారణాలు తెలియరాలేదు.

Show comments