Adilabad Crime News: భర్త గవర్నమెంట్ టీచర్.. మంచి శాలరీ.. కానీ ప్రియుడిపై మోజుతో

భర్త గవర్నమెంట్ టీచర్.. మంచి శాలరీ.. కానీ ప్రియుడిపై మోజుతో

Crime News in Adilabad.. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం.. ఆమెకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడు. కానీ భార్య మాత్రం వక్ర మార్గంలోకి వెళ్లింది. మహేష్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. చివరకు

Crime News in Adilabad.. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం.. ఆమెకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడు. కానీ భార్య మాత్రం వక్ర మార్గంలోకి వెళ్లింది. మహేష్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. చివరకు

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు విజయలక్ష్మీ. చాలా అందగత్తె. ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకునే భర్త ఉన్నాడు. బంగారం లాంటి పిల్లలున్నారు. కానీ అందమైన జీవితాన్ని తన చేతులతోనే తాను కాలరాసుకుంది. ప్రియుడి కోసం భర్తనే కడతేర్చిన కసాయి ఇల్లాలు. ఆదిలాబాద్‌లో సంచలనం కలిగిస్తున్న ఉపాధ్యాయుడు హత్య కేసులో భార్యే నిందితురాలిగా తేలింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా సినిమా స్టైల్లో సుఫారీ మాట్లాడి.. భర్తను లేపించేసింది. ఏమీ ఎరుగని దానిలా.. భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఫోన్ ట్రాప్ చేస్తే.. అసలు గుట్టు వీడింది. భార్యే హంతకురాలు అని తేలింది. ప్రస్తుతం ఈ హత్య కేసు తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లాలోని గాదేగూడ మండలంలోని ఓ గ్రామంలో నివసిస్తున్నారు భార్యా భర్తలు జాదవ్ గజానంద్ జైనథ్, విజయలక్ష్మీ. భర్త గజానంద్ టీచర్. అయితే కొన్ని రోజుల క్రితం భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. అంతలో అతడి మృతదేహం అనుమానాస్పద రీతిలో లభించింది. దీంతో దర్యాప్తు మరింత ముమ్మురం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు భార్య కదలికలపై అనుమానం వ్యక్తమైంది. ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్స్ డేటా, ఫోటోస్ చూసి బిత్తరపోయారు పోలీసులు. ప్రియుడి కోసం భర్తను చంపిందని నిర్ధారించారు. ప్రియుడు, విజయలక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు.

విజయలక్ష్మీకి, మహేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి.. అది ప్రణయానికి దారి తీసింది. భర్త ఉద్యోగానికి వెళ్లిపోగానే.. ప్రియుడితో కలిసి షికార్లు చేసేది. ఇద్దరు కలిసి ముద్దు ముచ్చట్లలో మునిగి తేలేవారు. వాటన్నింటిని ఫోటోలు తీసి ఎంతో అపురూపంగా తన ఫోనులోనే పెట్టుకుంది విజయలక్ష్మీ. అయితే తమ సంతోషానికి, ఆనందానికి భర్త గజానంద్ అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య విజయలక్ష్మీ అతడి అడ్డుతొలగించుకోవాలని అనుకుంది. ప్రియుడు మహేష్‌తో కలిసి ఈ విషయంపై చర్చించింది. తమ చేతికి మట్టి అంటకూడదన్న ఉద్దేశంతో.. ఓ సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడి.. భర్త మర్డర్‌కు స్కెచ్ వేసింది. అతడు తిరిగే ప్రాంతం, టైమ్ అన్ని చెప్పింది. దీంతో అదును చూసి సుపారీ గ్యాంగ్ అతడ్ని చంపేసింది. అనంతరం తానేమీ ఎరుగన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..విజయలక్ష్మీ, ఆమె ప్రియుడు మహేష్ గుట్టు రట్టయ్యింది. ఇదర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

Show comments