iDreamPost

బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబానికి తాకిన కరోనా

బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబానికి తాకిన కరోనా

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా రోజు రోజుకి దేశంలో ప్రబలిపోతుంది. భారత మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబ సభ్యులు కూడా తాజాగా ఈ వైరస్ బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. గంగూలీ అన్నయ్య స్నేహసిష్ భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ వైరస్ సొకినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా స్నేహసిష్ యొక్క మోమిన్పూర్ ఇంటిలో పనివారికి కూడా ఈ వైరస్ సోకినట్టు పరిక్షల్లో తేలింది.

దీంతో మాజీ రంజీ స్థాయి క్రికెటర్ అయిన స్నేహశిష్ కూడా వైరస్ నిర్ధారణ కోసం పరీక్షలు నిర్వహించగా అతనికి నెగిటివ్ వచ్చింది. అతను ముందు జాగ్రతగా సెల్ఫ్ క్వారంటయిన్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది. స్నేహశిష్ ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) కార్యదర్శిగా ఉన్నారు. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి, గంగూలీ సమాజంలోని నిరుపేద వర్గాలకు రోజూ సహాయం చేస్తున్నారు. గత నెలలో పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలోని కొన్ని ప్రాంతాలను తాకిన తుఫాను బారిన పడిన బాధితులకు సహాయం చేయడానికి కూడా దాదా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి