Jagan Helps Samrlakota Woman: మహిళ ప్రాణం నిలబెట్టిన జగన్‌.. ఆఖరి నిమిషంలో రూ.18 లక్షల సాయం చేసి

మహిళ ప్రాణం నిలబెట్టిన జగన్‌.. ఆఖరి నిమిషంలో రూ.18 లక్షల సాయం చేసి

CM YS Jagan: అన్నా అని పిలిస్తే.. చాలు వెంటనే స్పందించి.. వారి సమస్య తెలుసుకుని సాయం చేస్తాడు సీఎం జగన్‌. ఓ మహిళకు నిమిషాల వ్యవధిలో భారీ సాయం అందించి.. ఆమె ప్రాణాలు నిలబెట్టారు. ఆవివరాలు..

CM YS Jagan: అన్నా అని పిలిస్తే.. చాలు వెంటనే స్పందించి.. వారి సమస్య తెలుసుకుని సాయం చేస్తాడు సీఎం జగన్‌. ఓ మహిళకు నిమిషాల వ్యవధిలో భారీ సాయం అందించి.. ఆమె ప్రాణాలు నిలబెట్టారు. ఆవివరాలు..

అన్నా అని పిలిస్తే చాలు వెంటనే స్పందిస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆపద అంటే చాలు వెంటనే ఆదుకుంటారు. అందుకే ప్రజలు తమకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ధైర్యం కొల్పోకుండా.. మా నాయకుడు జగన్‌ ఉన్నాడు కాదా.. ఒక్కసారి ఆయనను కలిసి సమస్య చెప్పుకుంటే చాలు.. ఆయనే పరిష్కారం చూపుతారు అని నమ్ముతారు. ప్రజల్లో ఆయన మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఇక సమస్య అంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుని.. తిరిగి వారి జీవితాల్లో చిరు నవ్వులు నింపుతున్నారు జగన్‌. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. వాటిల్లో ఒకటి ఈ సంఘటన. ప్రాణపాయ స్థితిలో ఉన్న మహిళకు.. నిమిషాల వ్యవధిలోనే 18 లక్షల సాయం చేసి.. అపద్బాంధవుడిగా నిలిచారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు రమణమ్మ. కాకినాడ జిల్లా పెద్దాపూరం మండలం, వాలు తిమ్మాపురం గ్రామం. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. రమణమ్మ భర్త పాపన్న సామర్లకోటలో పాత సామానులు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎలాంటి సమస్య లేకుండా సాగుతున్న వీరి జీవితంలో.. ఐదేళ్ల క్రితం భారీ కుదుపుకు గురయ్యింది. రమణమ్మకు ఊపిరితిత్తులు పూర్తిగా పాడవ్వడమే కాక, జీర్ణాశయ వ్యాధి బారిన పడింది. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవ్వడంతో.. ఆమె నడవలేని స్థితికి చేరుకుంది.

ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుందామంటే.. రమణమ్మకు వచ్చిన వ్యాధులు దాని పరిధిలోకి రావని తెలిపారు వైద్యులు. ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెను పరిక్షీంచిన వైద్యులు.. రమణమ్మకు ఊపిరితిత్తులు, ప్రేవులు తొలగిస్తే.. ఆమె బతుకుతుంది అన్నారు. ఆపరేషన్‌కు 18 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబానికి 18 లక్షలు అంటే తలకు మించిన భారమే. దాంతో వారు ఆశ వదిలేసుకున్నారు.

కానీ రమణమ్మ మాత్రం.. తాను బతుకుతానని.. తన అన్న జగన్‌ను కలిస్తే.. సమస్యకు పరిష్కారం చూపుతారని భావించింది. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌ సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశాల ప్రారంభోత్సవాల్లో సీఎం జగన్‌ పాల్గొంటారని తెలుసుకున్న రమణమ్మ.. ఎలా అయినా సరే.. తన అన్నను కలిసి.. సమస్య గురించి చెప్పాలని భావించింది. సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం ముగించుకుని వెళ్తున్న జగన్‌ దగ్గరకు వెళ్లి.. తన పరిస్థితి వివరించింది రమణమ్మ. తనను ఆదుకోవాలని కోరింది.

రమణమ్మ పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్‌.. వెంటనే అక్కడిక్కడే 18 లక్షల రూపాయలు సీఎం నిధి కింద అందిస్తూ చెక్కు ఇచ్చారు. నీకేం కాదని.. తాను ఉన్నానని హామీ ఇచ్చారు సీఎం జగన్‌. ఆ తర్వాత రమణమ్మ కుటుంబ సభ్యులు.. ఆ చెక్కు తీసుకుని.. తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం రమణమ్మ కోలుకుంటుంది.

సీఎం జగన్‌ తమను ఆదుకోకపోతే.. ఈ రోజు తమ తల్లి తమ మధ్యన ఉండేది కాదని.. తమ తల్లికి ప్రాణం పోసిన దేవుడు జగన్‌ అంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు రమణమ్మ బిడ్డలు. సీఎం జగన్‌ ఒక్కసారి మాట ఇస్తే.. దానికే కట్టుబడి ఉంటారని.. దటీజ్‌ జగన్‌ అంటున్నారు ఈ విషయం తెలిసిన జనాలు. మరి సీఎం జగన్‌ చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి

Show comments