iDreamPost

జగన్‌ దూకుడు.. మంత్రులకు శాఖల కేటాయింపు.. మహిళకే హోం మంత్రిపదవి

జగన్‌ దూకుడు.. మంత్రులకు శాఖల కేటాయింపు..  మహిళకే హోం మంత్రిపదవి

వేగంగా నిర్ణయాలు తీసుకునే సీఎం వైఎస్‌ జగన్‌.. మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు గంటల వ్యవధిలోనే మంత్రులకు శాఖలు కేటాయించారు. సోమవారం మధ్యాహ్నం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా.. గంటల వ్యవధిలో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు శాఖలు కేటాయించడంతోపాటు గతంలో పాటించిన సాంప్రదాయాన్నే ఈసారి కొనసాగించారు. ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామాజికవర్గ నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు.

మంత్రులకు కేటాయించిన శాఖలు..

1. ధర్మాన ప్రసాదరావు– రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలు

2. సీదిరి అప్పలరాజు – పశుసంవర్థక, మత్స్యశాఖలు

3. బొత్స సత్యనారాయణ – విద్యా శాఖ

4. పీడిక రాజన్నదొర (ఉప ముఖ్యమంత్రి –ఎస్టీ) – గిరిజన సంక్షేమశాఖ

5. గుడివాడ అమర్‌నాథ్‌ – పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ

6. బూడి ముత్యాలనాయుడు ( ఉప ముఖ్యమంత్రి –బీసీ) – పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు.

7. దాడిశెట్టి రాజా – రోడ్లు, భవనాల శాఖ

8. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ – బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫి శాఖలు.

9. పినిపే విశ్వరూప్‌ – రవాణా శాఖ

10. తానేటి వనిత – హోం శాఖ

11. కారుమూరి నాగేశ్వరరావు – పౌర సరఫరాల శాఖ

12. కొట్టు సత్యనారాయణ – దేవాదాయ శాఖ

13. జోగి రమేష్‌ – గృహ నిర్మాణ శాఖ.

14. మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమ శాఖ

15. విడుదల రజని – వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విద్యా శాఖ

16. అంబటి రాంబాబు – జలవనరుల శాఖ

17. ఆదిమూలపు సురేష్‌ – పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ

18. కాకాని గోవర్థన్‌ రెడ్డి – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖలు

19. ఆర్కే రోజా – పర్యాటకం, యువజన శాఖలు

20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, గనుల శాఖలు

21. కళత్తూరు నారాయణ స్వామి (ఉప ముఖ్యమంత్రి–ఎస్సీ) – ఎక్సైజ్‌ శాఖ

22. అంజాద్‌ భాషా (ఉప ముఖ్యమంత్రి – మైనారిటీ) – మైనారిటీ వ్యవహారాల శాఖ

23. బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి – ఆర్థిక శాఖ

24. గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ

25. కేవీ ఉషశ్రీ చరణ్‌ – మహిళల సంక్షేమ శాఖ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి