iDreamPost
android-app
ios-app

కొప్పర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన!

కొప్పర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..గత మూడు రోజుల నుంచి వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారంతో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన ముగిసింది.  నిన్న గండికోట ప్రాంతంలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి  సీఎం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇక నేడు కొప్పర్తిలో  పారిశ్రామికవాడ పరిశీలన, అభివృద్ధి పనులను ప్రారంభించారు.  అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి తిరుగు పయనమయ్యారు.

కడప జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పాటు బిజీబిజీగా గడిపారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయగా, వివిధ భవనాలను ప్రారంభించారు. ఇక సోమవారం కొప్పర్తి పర్యటనలో భాగంగా వైఎస్సార్ ఈఎంసీ క్లస్టర్ లో ఆల్ డిక్సన్ యూనిట్ ను ప్రారంభించారు. అంతేకాక పలు పారిశ్రామిక యూనిట్లను కూడా సీఎం జగన్ ప్రారంభించారు.  ఆల్ డిక్సన్ టెక్నాలజీస్  యూనిట్ లో సర్వైలెన్స్ కెమెరాలు,డిజిటల్ రికార్టర్, లాప్ టాప్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. ఆల్ డిక్సన్ సి.పి. ప్లస్ యూనిట్ లో 2 నుంటి 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. చైనా తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద యూనిట్ కొప్పర్తిలో ఏర్పాటు కానుంది.

కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  రూ.1.37 కోట్లతో ఏర్పాటైన రాజీవ్ పార్కు అభివృద్ధి పనులను, రూ.5.61 కోట్లతో పూర్తైన రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ఇక కడప పర్యటనలో ఉన్న సీఎం జగన్ కు.. ఆ జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ పర్యటనలో మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కడప నగరంమంత స్వరాంగ సుందరంగా ముస్తాబయ్యాంది. రాజీవ్ మార్గ్ లో పుట్ పాత్ లు, పార్కింగ్, డివైడర్లు, వీధి దీపాలతో అందంగా తయారైంది అలాగే కిడ్స్ జోన్, ఓపెన్ జిమ్, యోగా జోన్, ఓఏటీ, రెస్ట్ రూమ్ లతో కళాత్మకంగా తీర్చిదిద్దిన రాజీవ్ పార్కు సందర్శకులకు ఆహ్వానం పలికింది.