Revanth Reddy Key Decision: స్థానిక ఎన్నికలపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం! ఆ రెండు ఒకేసారి వచ్చేలా..

స్థానిక ఎన్నికలపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం! ఆ రెండు ఒకేసారి వచ్చేలా..

Revanth Reddy Key Decision: తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ.. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల జరిగాయి. ఎన్నికల సమయంలో కోడ్ అమల్లో ఉన్న కారణంగా పలు సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ పడింది.

Revanth Reddy Key Decision: తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ.. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల జరిగాయి. ఎన్నికల సమయంలో కోడ్ అమల్లో ఉన్న కారణంగా పలు సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ పడింది.

తెలంగాణలో గత ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మే(13) న పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు జూన్ 4 న వెలువడనున్నాయి. ఫలితాలపై అధికార పార్టీ.. ప్రతిపక్షాలు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నడుస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఫిబ్రవరి 1 తో సర్పంచ్ ల ఐదేళ్ల పాలనకు తెరపడింది. దీంతో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రామా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలపై సీఎం కీలక నిర్ణయం తీసున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నెలల గ్యాప్ లోనే వచ్చాయి. ఇక స్థానిక ఎన్నికల విషయంలో తర్జన భర్జన కొనసాగుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా అభివృద్ది పథకాల అమలు విషయంలో జాప్యం జరుగుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్ ఖారురు చేయకుండ ఎన్నికలు నిర్వహించకూడదన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలాగే బీసీ కులగణన, రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ, మున్సిపాలిటీలకు వెంట వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త ఎలక్షన్ కమీషనర్ నేతృత్వంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత స్టేట్ ఎలక్షన్ కమీషనర్ పార్థసారథి పదవీ కాలం సెప్టెంబర్ లో ముగియనున్నది.. ఆ స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పదవిలో వివాదాలకు అతీతంగా ఉన్న ఐఏఎస్ అధికారులను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వరుసగా ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉంటుంది.. దీంతో రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు బ్రేక్ పడటం ఇబ్బందికరంగా మారుతుందన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే కొంత గ్యాప్ ఇచ్చి స్థానిక ఎన్నికలు వచ్చే ఎడాదిలో ప్లాన్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Show comments