Exit polls 2024: చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఏపీలో మళ్లీ అధికారం వైసీపీదే! ఎన్ని సీట్లు అంటే?

చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఏపీలో మళ్లీ అధికారం వైసీపీదే! ఎన్ని సీట్లు అంటే?

Exit polls 2024: శనివారంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ పై అందరి చూపు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. చాణక్య పార్థ సంస్థ కూడా తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది.

Exit polls 2024: శనివారంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ పై అందరి చూపు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. చాణక్య పార్థ సంస్థ కూడా తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది.

నేటితో దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం జరిగిన ఏడో విడత పోలింగ్ తో సార్వత్రిక ఎన్నికల సమరంకి తెరపడింది. ఈనేపథ్యంలోనే ఇక అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పై  పడింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై  అందరిలో ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో దేశ ప్రజలందరి చూపు ఏపీ ఫలితాలపై ఉంది. ఈ క్రమంలోనే ఏపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్  వెల్లడయ్యాయి. ప్రముఖ సర్వే సంస్థ చాణక్య పార్థ  తన ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదల చేసింది. మరి.. చాణక్య పార్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో  ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం..

శనివారం సాయంత్రం చాణక్య పార్థ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసింది. వైఎస్సార్ సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. 110 నుంచి 120 సీట్లు వైఎస్సార్ సీపీ గెలుస్తుందని తన ఎగ్జిట్ పోల్స్ లో తెలిపింది. అలానే టీడీపీ కూటమి మరోసారి ప్రతిపక్షంలో ఉండనుందని అంచనా వేసింది.  టీడీపీ కూటమికి  55 నుంచి 65 మధ్యలో వస్తాయని  పేర్కొంది.  చాలా తక్కువ ఓటింగ్ శాతంతో  వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వే సంస్థ తెలిపింది. మొత్తంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం కానున్నారని తెలిపింది. చాణక్య పార్థ సర్వే ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలతో వైఎస్సార్ సీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

ఇక చాణక్య పార్థ గతంలో విడుదల చేసే సర్వే ఫలితాలను చూసినట్లు  అయితే.. అసలు ఫలితాలకు సరిపోయాయి. 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఆ సంస్థ చెప్పిన ఫలితాలు నిజయ్యాయి. ఇక తాజాగా చాణక్య పార్థ విడుదల చేసిన ఎగ్జిట్ ఫలితాలు చూసి..వైఎస్సార్ సీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చూస్తున్నాయి. తమ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎగ్జిట్ ఫలితాలు ఆసక్తిని మరింత పెంచాయి. ఇక అందరూ జూన్ 4వ తేదీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Show comments