Slogan Writing On My Income Tax My Pride Wine Rs 11000: కేంద్రం బంపరాఫర్.. ఉచితంగా ఖాతాలోకి రూ.11 వేలు.. ఏం చేయాలంటే

కేంద్రం బంపరాఫర్.. ఉచితంగా ఖాతాలోకి రూ.11 వేలు.. ఏం చేయాలంటే

Central Govt: కేంద్ర ప్రభుత్వం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. దీనిలో భాగంగా మీరు ఉచితంగా 11 వేలు పొందవచ్చు. కాకపోతే అందుకోసం మీరో సింపుల్‌ టాస్క్‌ చేయాలి. ఆ వివరాలు..

Central Govt: కేంద్ర ప్రభుత్వం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. దీనిలో భాగంగా మీరు ఉచితంగా 11 వేలు పొందవచ్చు. కాకపోతే అందుకోసం మీరో సింపుల్‌ టాస్క్‌ చేయాలి. ఆ వివరాలు..

కేంద్రప్రభుత్వం సామాన్యుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే వీటి గురించి సరైన ప్రచారం కల్పించకపోవడంతో.. చాలా వరకు పథకాల గురించి జనాలకు పెద్దగా తెలియదు. కొన్ని పథకాల వల్ల అయితే భారీగా ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుంది. కానీ వాటి గురించి జనాలకు పెద్దగా తెలియకపోవడంతో అవన్నీ వ్యర్థం అవుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఓ బంపరాఫర్‌ అందిస్తోంది. దీని వల్ల మీ ఖాతాలో ఉచితంగా 11 వేల రూపాయల నగదు జమ అయ్యే అవకాశం ఉంది. కానీ ఓ కండిషన్‌.. ఆ వివరాలు..

మీరు రూపాయి ఖర్చు చేయకుండా.. మీ ఖాతాలోకి ఉచితంగా 11 వేల రూపాయలు పొందవచ్చు. పైగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కాకపోతే ఇక్కడ మీరో కండిషన్‌ పాటించాలి. ఏంటి అంటే.. మీరు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పోటీలో పాల్గొని.. విజేతగా నిలవాలి. అప్పుడే మీకు 11 వేలు ఉచితంగా వస్తాయి. ఇంతకే పోటీ ఏంటి అంటే.. స్లోగన్‌ రైటింగ్‌ అన్నమాట. మోదీ సర్కార్ తాజాగా ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే మాత్రం ఉచితంగానే డబ్బులు పొందొచ్చు. అందువల్ల మీరు ఈ పోటీలో పాల్గొని మీ సత్తా చూపితే చాలు మీ ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తాయి.

ఇంతకు దేని మీద స్లోగన్స్‌ రాయాలంటే.. ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌.. పన్ను చెల్లింపుదారుల్లో చైతన్యం కలిగించడం కోసం ఈ స్లోగన్‌ రైటింగ్‌ పోటీ నిర్వహిస్తోంది. ఇది కేవలం హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోనే ఉంటుంది. దీనిలో పాల్గొని విజేతగా నిలిచిన వారికి రూ.11 వేలు అందిస్తోంది. టాప్‌లో నిలిచిన ముగ్గురికి ఈ డబ్బులు అందజేస్తారు. అంటే హిందీలో ముగ్గురికి.. ఇంగ్లీష్‌లో ముగ్గురికి ఈ ప్రైజ్‌ మనీ అందజేస్తారు అన్నమాట. దీనితో పాటు కన్సోలేషన్‌ ప్రైజ్‌ కింద మరి కొందరికి రూ.1000 చొప్పున అందిస్తారు. టాప్‌ 3లో నిలిచిన వారికి జూలై 24న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డే నాడు ప్రైజ్‌ మనీ అందించి సన్మానిస్తారు. ఇక ఈ పోటీలో పాల్గొనాలని భావించే వారు.. వెంటనే త్వరపడితే మంచిది.

ఈ పోటీకి సంబంధించి జూన్‌ 5 నుంచి ఎంట్రీలు ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్‌ 25 చివరి తేదీ. ఇందుకోసం మీరు మై గౌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఈ పోటీలోపాల్గొనవచ్చు. మంచి స్లోగన్‌ రాసి పోటీలో విజేతగా నిలిచి.. 11 వేల రూపాయల ప్రైజ్‌ మనీ పొందండి.

Show comments