Tax Payers: టాక్స్ పేయర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. సెక్షన్ 80C పరిమితి పెంపు!

టాక్స్ పేయర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. సెక్షన్ 80C పరిమితి పెంపు!

Tax Payers: బడ్జెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి..పన్ను చెల్లింపు దారులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా టాక్స్ పేయర్లకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు టాక్.

Tax Payers: బడ్జెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి..పన్ను చెల్లింపు దారులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా టాక్స్ పేయర్లకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు టాక్.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయ మార్గాల్లో పన్ను చెల్లింపులు ఒకటి. వివిధ వర్గాల వారి నుంచి పలు స్థాయిలు టాక్స్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలానే చాలా మంది తమ సంపాదన బట్టి ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తుంటారు. చాలా మంది సక్రమంగా తాము ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు. ఈ క్రమంలోనే తరచూ బడ్జెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి..పన్ను చెల్లింపు దారులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా టాక్స్ పేయర్లకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు టాక్. మరి.. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ సర్కార్.. త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఇటీవలే జూన్ 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్  ను ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కి మరోసారి మోదీ సర్కార్ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె వచ్చే జులైలో 6వ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ఇది ఇలా ఉంటే నూతన ప్రభుత్వం తరువాత ఇప్పుడు అందరి ఫోకస్ కేంద్ర బడ్జెట్ 2024-25పైనే ఆసక్తిగా ఉన్నారు. వచ్చే బడ్జెట్ లో తమకు మోదీ ప్రభుత్వం పన్ను ఉపశమనం కల్పించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక నిపుణులు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లో పన్ను చెల్లింపులకు సంబంధించిన సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ  విషయంలో పరిమితి పెంచాలని కోరుతున్నారు. చివరి సారిగా వార్షిక బడ్జెట్ 2014-15లో సెక్షన్ 80సీలో సవరణలు చేసింది. ఆ సమయంలో పన్ను పరిమితి రూ.1 లక్ష ఉండగా దానిని రూ.1.5 లక్షలకు పెంచింది.

ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక బాధ్యతల కారణంగా సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు లిమిట్ రూ.1.5 లక్షలు అనేది సరైనది కాదని టాక్స్ పేయర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న లిమిట్ పెంచడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట లభిస్తుందంటున్నారు. జులైలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారో వేచి చూడాల్సిందే. పన్ను చెల్లింపుదారులకు అనుగుణంగానే కేంద్ర నిర్ణయం కూడా ఉండొచ్చని పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే..పన్ను చెల్లింపు దారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించిందనే చెప్పొచ్చు.

Show comments