3లక్షలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌

3లక్షలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌

సీసీఎస్ ఇన్ స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. 3 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సీసీఎస్ ఇన్ స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. 3 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

లంచం తీసుకోవడం నేరం అని.. కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికీ కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. అక్రమ సంపాదనకు ఆశ పడి బాధితుల నుంచి లక్షల రూపాయలను లంచాలుగా తీసుకుంటున్నారు కొందరు అధికారులు. ప్రభుత్వ కార్యాలయాల్లో చేతులు తడపనిదే పని కాని పరిస్థితి నెలకొన్నది. లంచగొండి అధికారులపై యాంటీ కరప్షన్ బ్యూరో ఉక్కుపాదం మోపుతున్నది. లంచం తీసుకునే అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని శిక్షలు విధిస్తున్నది. ఈ క్రమంలో మరో అధికారి 3లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ వివాదంలో ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వడానికి బాధితుడి నుంచి లంచం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బాధితుడి వద్ద నుంచి సుధాకర్‌ రూ.15లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా బాధితుడు ముందుగా రూ.5 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత రెండో విడతలో గురువారం రూ.3 లక్షలు, మిగిలిన నగదు శనివారం ఇచ్చేందుకు ఒప్పందం కుదర్చుకున్నారు.

ఈక్రమంలో సీసీఎస్‌ ఎదురుగా ఉన్న పార్కింగ్‌ ప్రదేశంలో బాధితుడు రూ.3 లక్షలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అవినీతి నిరోధక శాఖ సిబ్బందిని గుర్తించి నగదు బ్యాగ్‌ వదిలేసి ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సినీఫక్కీలో వెంబడించి ఇన్ స్పెక్టర్ సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. మరి సీసీఎస్ ఇన్ స్పెక్టర్ లంచం తీసుకున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments